30ఏళ్లకే తెల్ల జుట్టు వచ్చేసిందా...? ఈ ఐదు చేస్తే.. మళ్లీ నల్లగా మారడం ఖాయం..!

First Published | Jul 29, 2024, 9:45 AM IST

ఆ తెల్ల జుట్టును కవర్ చేయడానికి ఏవేవో రంగులు వేయడం, హెన్నాలు పెట్టడం ఇలా తిప్పలు తిప్పలు కావు. కానీ... ఈ రంగుల బాధ లేకుండా... ఈ తెల్ల జుట్టు సమస్య తగ్గాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసా..?

ఎవరికైనా వయసు పెరుగుతుంటే..ఇంకాస్త యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. దాని కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే క్రీములు, ఆయిల్స్ దగ్గర నుంచి వంటింటి చిట్కాల వరకు అన్నీ ప్రయత్నిస్తూనే ఉంటారు. మనం ఓవైపు ఇంత కష్టపడుతుంటే.. మరోవైపు...జస్ట్ అలా 30 బోర్డర్ క్రాస్ చేశామో లేదో... తెల్లజుట్టురావడం మొదలౌతుంది. ఇది నిజంగా మనల్ని బాధిస్తుంది. ఎందుకంటే... తెల్లజుట్టు వచ్చింది అంటే.. వయసు పెరిగిపోయినట్లుగా భావిస్తారు. ఆ తెల్ల జుట్టును కవర్ చేయడానికి ఏవేవో రంగులు వేయడం, హెన్నాలు పెట్టడం ఇలా తిప్పలు తిప్పలు కావు. కానీ... ఈ రంగుల బాధ లేకుండా... ఈ తెల్ల జుట్టు సమస్య తగ్గాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసా..? దీనికి నిపుణుల దగ్గర సమాధానం ఉంది. మరి.. నిపుణులు చెప్పే ఈ ట్రిక్స్ మనం కూడా ఫాలో అయిపోదామా..? దానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...

దాదాపు అందరూ తెల్లజుట్టు రాగానే... ఆ తెల్ల జుట్టును ఎలా కనిపించకుండా కవర్ చేయాలా అని చూస్తూ ఉంటారు. కానీ... అలా కాకుండా.. ఆ తెల్ల జుట్టు పెరగకుండా.. దానిని అక్కడితో ఆగిపోయేలా చేయవచ్చు. అంటే దాని కోసం.. మన డైట్ లో కొన్ని ఫుడ్స్ ని చేర్చుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే... మనకు ఈ గ్రే హెయిర్ ప్రాబ్లం ఉండదో... దానిని ఎలా కంట్రోల్ చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం...

Latest Videos


అసలు 30ఏళ్లకు ఎవరికీ తెల్లజుట్టు రాకూడదు. అది కనీసం 45, 50ఏళ్ల వయసులో మొదలవ్వాల్సింది. కానీ మనకు ముందుగానే ఎందుకు వస్తోంది అంటే.. మనకు ఉన్న ఒత్తిడి కారణం కావచ్చు. లేదంటే.. శరీరానికి అవసరం అయిన పోషకాలు, న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ అందకపోవడం కావచ్చు. ముఖ్యంగా పోషకాల లోపంతోనే చిన్న వయసులోనే ఈ సమస్య మొదలౌతుంది.. కానీ... దానిని ఫుడ్స్ తోనే కంట్రోల్ చేయవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

amla juice

1.ఉసిరి..
ఉసిరికాయలో మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.  దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇదే ఉసిరి.. మనకు తెల్ల జుట్టు సమస్యను తగ్గిస్తుందని మీకు తెలుసా? ప్రతిరోజూ ఉదయంపూట 15మిల్లీ లీటర్ల ఉసిరికాయ జ్యూస్ ని కనుక తాగితే... చాలా తక్కువ సమయంలోనే మీకు తెల్లజుట్టు పెరగడం తగ్గిపోతుంది.  సహజంగా మీ జుట్టు పిగ్మెంటేషన్ ని సంరక్షించడంలో సహాయపడుతుంది.

2.కలోంజీ సీడ్స్.. వీటినే నల్లజీలకర్ర అని కూడా చెబుతారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవే గింజలు మన జుట్టు విషయంలో మంచి మ్యాజిక్ కూడా చేస్తాయి.  ఈ కలంజీ సీడ్స్ తో మంచి హెయిర్ మాస్క్ తయారు చేసుకొని.. దానిని కనుక వారానికి రెండుసార్లు అప్లై చేస్తే... చాలా తక్కువ సమయంలోనే మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. అంతేకాకుండా..కొత్తగా తెల్లజుట్టు రాకుండా కూడా ఆపుతుంది.

3. కరివేపాకు... కరివేపాకు సాధారణంగా వంటల రుచిని పెంచడంలో సహాయపడుతుంది.  అయితే అవి అకాల జుట్టు నెరపడాన్ని కూడా తగ్గించగలవని మీకు తెలుసా? "కరివేపాకు ఆకులు హెయిర్ ఫోలికల్స్‌లో మెలనిన్ ఉత్పత్తిని పునరుద్ధరిస్తాయి, ఇది బూడిద రంగును తగ్గిస్తుంది కాబట్టి, వీలైనంత వరకు ఈ ఆకులను మీ ఆహారంలో చేర్చుకోండి.  ప్రతిరోజూ 3-4 కరివేపాకులను ఖాళీ కడుపుతో తింటే.. రిజల్ట్ మీరే స్వయంగా చూస్తారు.

4. గోధుమ గడ్డి... అకాల జుట్టు నెరసిపోకుండా ఉండటానికి మీరు గోధుమ గడ్డిని కూడా తీసుకోవచ్చు.  గోధుమ గడ్డి వెంట్రుకల కుదుళ్లను ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుందని, తద్వారా బలమైన జుట్టును ప్రోత్సహిస్తుంది. అదనంగా, గోధుమ గడ్డి టాక్సిన్స్  తొలగించడంలో కూడా సహాయపడుతుంది. గోధుమ గడ్డిని ఎలా తినాలి అని ఆలోచిస్తున్నారా? మీ భోజనంలో దేనికైనా 1 టీస్పూన్ కలపండి లేదా నీటిలో కలపండి  ఉదయాన్నే తినండి.

black sesame seeds

5. నల్ల నువ్వులు... మీ జుట్టుకు మరొక సూపర్ ఫుడ్ నల్ల నువ్వులు. ఈ గింజలు మీ జుట్టును ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. శిరోజాలను పోషించడంలో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం ద్వారా జుట్టు తెల్లగా మారడాన్ని  చాలా వరకు నివారించవచ్చు. ఏదైనా భోజనంలో 1 టీస్పూన్ నల్ల నువ్వుల గింజలను జోడించాలి. లేదంటే.. నల్లనువ్వులను నూనెలో మరిగించి ఆ నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. 

click me!