నాగచైతన్యకు కాబోయే భార్య శోభితను ఈ లుక్ లో ఎప్పుడైనా చూశారా?

First Published | Aug 9, 2024, 9:59 AM IST

ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయకుండా.. కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఎంగేజ్మెంట్ చేసుకుని నాగచైతన్య, శోభిత ధూళిపాల అందరికీ షాక్ ఇచ్చారు. ఈ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న శోభిత ధూళిపాలని మీరు ఈ లుక్ లో ఎప్పుడూ చూసి ఉండరు. 
 

Sobhita


సడెన్ గా శోభిత ధూళిపాల పేరు ఇండస్ట్రీలో మారు మోగుతోంది. కారణం అందరికీ తెలిసిందే. నిన్నే ఈ హీరోయిన్ అక్కినేని హీరో నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. నిజానికి ఈ విషయం శోభిత కానీ, నాగచైతన్య గానీ, అక్కినేని ఫ్యామిలీ గానీ ఎవరూ అనౌన్స్ చేయలేదు. ఈ జంటపై ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. నాగచైతన్య, శోభిత డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ వీటిపై వీళ్లు మాత్రం నోరు విప్పలేదు. కానీ నిన్న సడెన్ గా ఎంగేజ్మెంట్ ఫోటోలతో అందరికీ షాక్ ఇచ్చారు. ఏదేమైనా అక్కినేని కోడలు కావడం శోభిత అదృష్టమని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. 
 

శోభితా చాలా తక్కువ సినిమాల్లో చేసింది. కానీ ఈమె తన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తనుకున్న మచ్చలేని ఫ్యాషన్ సెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అది రెడ్ కార్పెట్ మీదైనా, సినిమాల్లో అయినా, పర్సనల్ లైఫ్ లో అయినా.. ఆమె ఎక్కడా కాన్ఫిడెన్స్ ను కోల్పోదు.  ఇకపోతే రీసెంట్ గా నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకుని అందరికీ మర్చిపోలేని షాక్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె అత్యంత ఫ్యాషనబుల్ గా కనిపించిన కొన్ని ఫోటోలను ఇప్పుడు చూసేద్దాం పదండి. 


చీరకట్టులో శోభితా ధూళిపాళ

శోభితా ధూళిపాళకు ఎలాంటి డ్రెస్ అయినా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా చీరకట్టులో ఈ బ్యూటీ అందం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హావ భావాలు వ్యక్తీకరించే కళ్లతో, మచ్చలేని ఐలైనర్ తో ఈ చీరలో శోభిత లుక్ వావ్ అనిపింది. ఈ చీరకు మ్యాచ్ అయ్యే విధంగా అద్బుతమైన ఆభరణాలను ధరించడంతో ఆమె మరింత  బ్యూటీపుల్ గా కనిపిస్తోంది. ఈ లుక్ ను ఎవ్వరు ట్రై చేసినా అందంగా కనిపిస్తారు. 
 

రెడ్ బాడీకాన్ గౌన్ లో శోభితా ధూళిపాళ

శోభితా ధూళిపాళ రెడ్ బాడీకాన్ గౌన్ లో తిరుగులేని గ్లామర్ తో అదరగొట్టింది. మతిపోగొట్టే కర్లీ హెయిర్, బోల్డ్ రెడ్ లిప్ స్టిక్ లో తన ఆత్మవిశ్వాసంతో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. మచ్చలేని ముఖం  ప్రేక్షకులను కట్టిపడేసే అందమైన కళ్లతో వావ్ అనిపించింది. 
 

బ్లాక్ డ్రెస్ లో శోభితా ధూళిపాళ

ఫ్యాషన్ మ్యాగజైన్ కు ఎలాంటి లుక్ లో కనిపించాలో శోభిత ధూళిపాలకు బాగా తెలుసు. దుస్తుల ఎంపికలో ఈమెకు మంచి టాలెంట్ ఉంది.  ఈ బ్లాక్ డ్రెస్ లో ఆమె అద్బుతంగా, చాలా స్టైలిష్ గా ఉంది. ఈమె ఫ్యాషన్ సెన్స్, కట్టిపడేసే లుక్ ఆమెను నిజమైన ఫ్యాషన్ ఐకాన్ గా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
 

 బ్లాక్ మినీ లేస్ డ్రెస్ లో శోభితా ధూళిపాళ

శోభితా ధూళిపాళ బోల్డ్ బ్లాక్ బాడీ సూట్ లో ఎంత అందంగా ఉందో చూశారా? ఈమెకున్న ఫ్యాషన్ సెన్స్ ఈ డ్రెస్సును చూస్తేనే అర్థమవుతుంది. ఈ ఫ్యాషన్ ఎంపికలు ఆమెను మరింత అందంగా మార్చేస్తాయి. శోభిత ధూళిపాలకు నిజంగానే తనదైన శైలిలో స్టేట్ మెంట్ ఎలా ఇవ్వాలో బాగా తెలుసు.
 

 శోభిత ధూళిపాళ చీరలో..

చీరలో శోభితా ధూళిపాళ అధునాతనంగా, ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈమె కేవలం మోడ్రన్ డ్రెస్సులనే కాదు.. సంప్రదాయ దుస్తులను కూడా ధరిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. నిజానికి సంప్రదాయ దుస్తుల్లో శోభిత మరింత అందంగా కనిపిస్తుంది. శోభిత ఫ్యాషన్ ఛాయిస్ లు ఆమెను  ఫ్యాషన్ ఐకాన్ గా నిలబెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 
 

Latest Videos

click me!