ఇవి తిన్నా.. మీ జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది..

First Published | Jul 31, 2024, 3:21 PM IST

చాలా మందికి హెయిర్ ఫాల్ సమస్య ఉంటుంది. ఇక వెంట్రుకలు ఊడిపోకూడదని రకరకాల షాంపూలను, నూనెలను వాడుతుంటారు. అయినా జుట్ట రాలడం మాత్రం ఆగదు. నిజానికి హెయిర్ ఫాల్ తగ్గాలంటే మంచి పోషకాహారం తినాలి. 
 

జుట్టూ ఊడిపోయే సమస్య దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ మనలో ప్రతి ఒక్కరూ షాంపూ మంచిది కాదేమో, నూనె మంచిది కాదేమో.. వీటి వల్లే జుట్టు ఊడిపోతుందని వాటిని మారుస్తూ ఉంటారు. కానీ మీరెన్ని షాంపూలను, నూనెలను, కండీషనర్లను మార్చినా జుట్టు ఊడిపోవడం మాత్రం ఆగదు. ఎందుకంటే జుట్టుకు పోషకాలు లేకపోవడం వల్లే బాగా ఊడిపోతుంది. కాబట్టి హెయిర్ ఫాల్ ఆగాలంటే ముందు మీరు చేయాల్సింది మంచి పోషకాలున్న ఆహారాన్ని తినడం. మీరు మంచి పోషకాలను తీసుకుంటే మీ జుట్టు ఊడిపోవడం ఆగి, బాగా పెరుగుతంది. అలాగే మీ జుట్టు ఆకృతి కూడా మెరుగుపడుతుంది. అందుకే హెయిర్ ఫాల్ తో బాధపడేవారు వంటింట్లో ఉంటే వేటిని తింటే జుట్టు రాలడం ఆగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మీ జుట్టు రాలడం ఆగాలంటే మీ రోజువారి ఆహారంలో కొబ్బరి పాలు లేదా తాజా కొబ్బరిని చేర్చండి. ఎందుకంటే దీనిలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తాయి. అలాగే ఇవి మీ జుట్టు కుదుళ్లకు పోషకాలను అందిస్తాయి. 


sesame seeds

నువ్వులు కూడా జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని వంటలో లేదా వీటితో లడ్డూలు తయారు చేసి తినొచ్చు. లేదా పండ్లపై చల్లి ఆహారంలో చేర్చుకోవచ్చు. నువ్వుల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. 

curry leaves

కరివేపాకు కూడా జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే మీ రోజువారి ఆహారంలో కరివేపాకును చేర్చండి. ఇది జుట్టు రాలడాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. కరివేపాకులో విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

soaked almonds

జుట్టు రాలడం ఆగడానికి మీరు నానబెట్టిన బాదం పప్పులను కూడా తినొచ్చు. మీ జుట్టు హెల్తీగా ఉండాలంటే మాత్రం.. మీరు ప్రతిరోజూ కనీసం 2 నుంచి 3 నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే తినండి. ఈ పప్పుల్లో విటమిన్ ఇ, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడానికి సహాయపడతాయి. 


మజ్జిగ లేదా పెరుగు కూడా ఆరోగ్యానికే కాదు.. జుట్టుకు కూడా మంచి మేలు చేస్తుంది. అందుకే వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ బి, ప్రోటీన్, లాక్టిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్ ఇలా అన్ని పోషకాలు జుట్టు ఊడిపోకుండా చేసి.. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Latest Videos

click me!