పూరీలు ఎన్ని గంటలైనా మెత్తగా ఉండాలంటే ఇలా చేయండి

First Published | Nov 7, 2024, 11:40 AM IST

చాలా మంది.. మేము చేసిన పూరీలు గట్టి గట్టిగా వస్తున్నాయంటూ వాపోతుంటారు. పూరీలు మెత్తగా వచ్చేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయినా ఫెయిల్ అవుతుంటారు. కానీ మీరు కొన్ని పద్దతులను ఫాలో అయితే మాత్రం మీరు చేసిన పూరీలు మెత్తగా, సాఫ్ట్ గా వస్తాయి. ఎన్ని గంటలైనా అలాగే మెత్తగా ఉంటాయి. 


ఒక్క పండగలప్పుడే కాదు.. వారానికి ఒకసారైనా పూరీలను చేసుకుని తినేవారు చాలా మందే ఉన్నారు. నిజానికి పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కానీ ఈ పూరీలు మెత్తగా మాత్రం రావు. హోటల్ స్టైల్ లో పూరీలు మెత్తగా, సాఫ్ట్ గా రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా పూరీలు మెత్తగా రానేరావు. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం ఖచ్చితంగా పూరీలు మెత్తగా అవుతాయి. 

పూరీలు మెత్తగా, సాఫ్ట్ గా రావాలంటే పిండిని సరిగ్గా కలపాలి. ఈ పిండి ముద్ద క్రిస్ప్ ఆకృతిని కలిగి ఉండేలా చూసుకోవాలి. అలాగే వీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద కాల్చడం కూడా చాలా ముఖ్యం.

ఇలా చేస్తేనే మీరు చేసిన పూరీలు గంటలు గంటలు మెత్తగా ఉంటాయి. మీరు మెత్తని, సాఫ్ట్ పూరీలను తయారుచేయడానికి పిండిలో రెండు పదార్థాలను ఖచ్చితంగా కలపాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. 
 

పెరుగు

అవును పూరీ పిండిలో కొంచెం పెరుగును కలిపితే హోటల్ స్టైల్లో పూరీలు రెడీ అయిపోతాయి. పెరుగును పూరీ పిండిని సాఫ్ట్ గా చేస్తుంది. అంతేకాదు పూరీకి మంచి రుచిని కూడా తెస్తుంది. పెరుగులో ఉండే సహజ ఆమ్లత్వం, తేమ పిండిని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే ఇది పిండిలోని గ్లూటెన్ను విచ్ఛిన్నం చేయడానికి కూడా సహాయపడుతుంది. 

పెరుగులో ఉడే ఆమ్లత్వం పిండిలోని ప్రోటీన్లను మృదువుగా చేసి పూరీలు మెత్తగా వచ్చేలా చేస్తుంది. దీంతో పూరీలు ఎంత సేపైనా గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి. పూరీలు గట్టిపడకుండా చేయడానికి పెరుగు చాలా ఎఫెక్టీవ్ గా పనచిేస్తుంది. ఇది పూరీని ఎక్కువ క్రిస్పీగా చేయదు. కానీ పెరుగు పూరీ మంచి టేస్ట్ వచ్చేలా చేస్తుంది. 
 


పెరుగును పిండిలో ఎలా వేయాలి? 

ఇందుకోసం ఒక కప్పుడు పూరీ పిండిలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసి కలపండి. దీంతో పిండి మెత్తగా ఉంటుంది. పిండిని కలిపిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకోండి. దీంతో పెరుగు తన పని తాను చేసుకుపోతుంది. అలాగే మీరు కలిపి పెట్టిన పిండి ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. 

సెమోలినా

పూరీ పిండిలో కొంచెం సెమోలీనా కలిపినా కూడా పూరీలు మెత్తగా వస్తాయి. దీనివల్ల పూరీలు లోపలి నుంచి మెత్తగా ఉండి, బాగా ఉబ్బుతాయి. సెమోలినా వల్ల పిండి తేమగా ఉంటంుది. అలాగే పూరీలు ఎక్కువ నూనెను పీల్చుకోకుండా మెత్తగా, సాఫ్ట్ గా ఉంటాయి.  ఈ సెమోలినా బయటి నుంచి పూరీకి కొద్దిగా క్రిస్పీని తెస్తుంది. కానీ లోపలి నుంచి మాత్రం మెత్తగా ఉంచుతుంది. 

సెమోలినాను పిండిలో ఎలా కలపాలి? 

ఒక కప్పు పూరీ పిండిలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల సన్నని సెమోలినాను కలపండి. అయితే ఈ పిండిని బాగా కలపాలి. అప్పుడే దాంట్లో సెమోలీనా సమానంగా కలిసిపోతుంది.  ఆతర్వాత పిండిలో నీళ్లు పోస్తూ బాగా కలుపుకోండి. తర్వాత పిండిని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. 

మెత్తని పూరీల కోసం కొన్ని చిట్కాలు

పిండిని కలుపుకుని దానిపై మూతపెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల పిండిలోని గ్లూటెన్ బాగా పనిచేస్తుంది. అలాగే పిండిని మెత్తగా చేస్తుంది. అలాగే ఇది సెమోలినా తేమను గ్రహించడానికి కూడా సహాయపడుతుంది. పిండి ఆకృతిని మెరుగుపరుస్తుంది.

అయితే పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మరీ మెత్తగా, మరీ గట్టిగా కలుపుకోకూడదు. మరీ లూజ్ గా కలుపుకున్న పూరీలు ఎక్కువ నూనెను గ్రహిస్తాయి. పిండిని చల్ల నీళ్లతో కాకుండా.. గోరువెచ్చని నీళ్లతో కలుపుకోండి. వేడినీళ్లు పిండికి తేమను ఎక్కువ సేపు ఉండేలా చూస్తాయి. అలాగే పిండిని మెత్తగా చేస్తాయి. అలాగే పూరీలు బాగా ఉబ్బుతాయి. 

ఎప్పుడైనా సరే నూనె చల్లగా ఉన్నప్పుడు పూరీలను కాల్చితే అవి నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకే నూనె వేడిగా ఉన్నప్పుడే వేయాలి. అలాగే నూనె మరీ వేడిగా ఉంటే పూరీలు త్వరగా బంగారు రంగులోకి మారి ఉడకనివ్వవు. కాబట్టి ఎప్పుడైనా సరే పూరీలను మీడియం ఫ్లేమ్ మంట మీదే కాల్చాలి. 


పూరీని గంటల తరబడి మెత్తగా ఉండాలంటే ఏం చేయాలి? 

పూరీలను కాల్చిన తర్వాత వాటికి అంటుకున్న నూనెను గ్రహించడానికి పూరీలను కాగితపు టవల్స్ పై ఉంచండి. అలాగే వాటిని శుభ్రమైన కాటన్ వస్త్రంతో కప్పండి. ఇది వాటి ఆవిరి పోకుండా చూస్తుంది. దీంతో పూరీలు తొందరగా గట్టిపడకుండా ఉంటాయి. 

మీరు ఎటైనా పూరీలను తీసుకెళ్తుంటే.. వాటిని ఇన్సులేటెడ్ కంటైనర్లు లేదా హాట్ బాక్సుల్లో పెట్టండి. ఇన్సులేషన్ వేడి, తేమను నిలుపుకుంటుంది. దీంతో పూరీలు ఎంతసేపైనా మెత్తగా ఉంటాయి. ఇకపోతే పూరీలను నిల్వ చేసేటప్పుడు ఒకదానిపై మరొకటి ఎక్కువ పూరీలను ఉంచకూడదు. దీనివల్ల పూరీలు తడిగా అవుతాయి. అలాగే నూనెను కూడా ఎక్కువగా గ్రహిస్తాయి. 

Latest Videos

click me!