నల్లటి మెడని శుభ్రం చేసే చిట్కాలు:
పెరుగు, నిమ్మరసం
పెరుగు, నిమ్మరసం నల్లగా ఉన్న మెడను తిరిగి తెల్లగా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మెడ నలుపును పోగొట్టడానికి కొంచెం పెరుగును తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపండి. దీన్ని మెడకు అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. ఇలా మీరు వారానికి రెండు సార్లు చేస్తే మీ మెడ నలుపు పోయి తెల్లగా అవుతుంది.
బొప్పాయి, పెరుగు
నల్లగా ఉన్న మెడను తెల్లగా చేయడానికి మీరు బొప్పాయి, పెరుగును కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం బాగా పండిన బొప్పాయి గుజ్జును తీసుకుని దీంట్లో రెండు చెంచాల పెరుగును వేసి బాగా కలపండి. దీన్ని మెడకు రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. 5 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.