వీటిని తింటే.. పొట్టి జుట్టు పొడుగ్గా అవుతుంది తెలుసా?

First Published | Nov 6, 2024, 1:43 PM IST

చాలా మందికి జుట్టు పల్చగా, పొట్టిగా ఉంటుంది. జుట్టు పెరగకపోవడానికి, వెంట్రుకలు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మీరు కొన్ని ఆహారాలను తింటే మాత్రం పొట్టిగా, పల్చగా ఉన్న జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. 

మనలో చాలా మంది ఒత్తైన, పొడవాటి జుట్టు ఉండాలని ఆశగా ఉంటుంది. ఇందుకోసం రకరకాల నూనెలను, షాంపూలను జుట్టుకు పెడుతుంటాం. అయినా కొంచెం కూడా లాభం ఉండదు. నిజానికి మన జుట్టు ఎలా ఉందనేది జెనెటిక్స్ పై ఆధారపడి ఉంటుంది. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా జుట్టు రాలే సమస్య ఉంటే.. మీకు కూడా అదే జరుగుతుంది. 

ఒక్క జెనెటిక్స్ వల్లే కాదు.. పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, కాలుష్యం, జుట్టు సంరక్షణ సరిగ్గా లేకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మన రోజువారి ఆహారంలో కొన్ని సూపర్ ఫుడ్స్ ను చేర్చడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే జుట్టు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఏవి తింటే జుట్టు బలంగా, ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

అవొకాడో

అవొకాడో ఒక మంచి పోషకమైన ఆహారం. ఇది మన చర్మాన్నే కాదు మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ అవొకాడో మన జుట్టుకు కూడా చాలా మంచిది. ఈ పండులో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.

ఇవి మన నెత్తికి మంచి పోషణను అందిస్తాయి. జుట్టు పెరగడానికి కూడా బాగా సహాయపడతాయి. అవొకాడోను తినడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి. దీంతో వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఉండదు. అలాగే జుట్టు రాలే సమస్య కూడా ఉండదు. 
 


Salmon

సాల్మన్

ఈ సాల్మన్ చేప మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ప్రోటీన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. మన జుట్టు  ఆరోగ్యంగా పెరగడానికి ఇవన్నీ చాలా అవసరం. ఈ చేపలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మన జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణను అందిస్తాయి.

అలాగే నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే నెత్తిమీద మంటను తగ్గిస్తాయి. ఇది మీ జుట్టు బలంగా, కాంతివంతంగా చేస్తుంది. మీ ఆహారంలో సాల్మన్ చేపలను చేర్చడం వల్ల జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరగడం ప్రారంభమవుతుంది. 

ఆకుకూరలు

ఆకు కూరల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పోషకాలకు మంచి వనరు బచ్చలికూర. ఈ ఆకు కూరలో విటమిన్ ఎ, ఐరన్, విటమిన్ సి, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి చాలా అవసరం.

ఈ పోషకాలు జుట్టు కుదుళ్లకు పోషణను అందించడానికి, నెత్తిమీద రక్తప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది సెబమ్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ఇది నెత్తిని తేమగా ఉంచే ఒక సహజ నూనె. మీ ఆహారంలో బచ్చలికూరను చేర్చడం వల్ల మీ జుట్టు మందంగా అవుతుంది. అలాగే జుట్టు మీరు కోరుకున్నట్టు పెరుగుతుంది. 
 

eggs

గుడ్డు

గుడ్లు సంపూర్ణ ఆహారం. గుడ్డులో బయోటిన్, ప్రోటీన్, విటమిన్లు బి 12, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యానికి ఇవన్నీ చాలా అవసరం. మీకు తెలుసా? ప్రోటీన్ జుట్టుకు బిల్డింగ్ బ్లాక్. ఇది జుట్టు పొడుగ్గా పెరగడానికి సహాయపడుతుంది.

గుడ్డులోని బయోటిన్, ఇతర విటమిన్లు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి. అలాగే కొత్త జుట్టు  పెరగడానికి సహాయపడతాయి. మీ రోజువారి ఆహారంలో గుడ్డును చేర్చితే మీ జుట్టు పొడుగ్గా పెరగడమే కాకుండా.. బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. 

Latest Videos

click me!