తెల్లని సాక్సులపై బురద మరకలు ఎలా ఈజీగా తొలగించాలి?

First Published May 10, 2024, 2:48 PM IST

తెల్ల‌ని సాక్సుల‌పై బుర‌ద మ‌ర‌క‌లు ఎంత ఉతికినా క‌నిపిస్తుంటాయి. అయితే, కొన్ని నిమిషాల్లో ఈ మరకను తొలగించడానికి కొన్ని సులభమైన చిట్కాలను మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

తెల్లని సాక్సుల మీద బురద పడిన తర్వాత చాలా మందికి మరకలు పోకపోవడంతో వాటిని పక్కన పడేసి కొత్త సాక్సులను కొనుక్కోవాలనిపిస్తుంది. దాని కోసం మళ్లీ కొంత డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, మీకు అలాంటి ఖర్చులతో పనిలేకుండా ఈజీగా తెల్లని సాక్సులపై పడిన బురద మరకలను తొలగించే సులభమైన కొన్ని చిట్కాలు మీకోసం.. 
 

వేడి నీరు-బేకింగ్ సోడా

వేడినీళ్లు, బేకింగ్ సోడాతో నిమిషాల్లో బురద ప‌డిన తెల్ల‌ని లేదా ఇత‌ర రంగు క‌లిగిన సాక్సుల‌ను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. దీని కోసం మీరు పెద్ద‌గా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. వేడినీటిలో బేకింగ్ సోడా వేసి అందులో సాక్సుల‌ను వేసి కొద్ద స‌మ‌యం ఉంచాలి. కాసేపటి తర్వాత సాధారణ నీటితో వీటిని క‌డ‌గాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల సాక్సుల‌కు అంటుకున్న బుర‌ద మ‌ర‌క‌లు ఈజీగా తొల‌గిపోతాయి.
 

బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయ‌డం..

బుర‌ద మ‌ర‌క‌లు అంటిన సాక్సుల‌ను శుభ్రం చేయ‌డానికి బ్లీచింగ్ పౌడర్ ను ఉపయోగిస్తే పాత సాక్సులు కూడా నిమిషాల్లో కొత్త వాటిలా ప్రకాశిస్తాయి. ఒక మగ్ లో అర మగ్ వేడినీళ్లు తీసుకోవాలి. అందులో కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ వేసి మరకలు పడిన భాగాన్ని ముంచి అరగంట పాటు నాన‌బెట్టాలి. దీని తరువాత, సాధారణ నీటి సహాయంతో సాక్సుల‌ను శుభ్రం చేయడంలో మ‌ర‌క‌లు తొల‌గిపోతాయి.
 

ఆల్క‌హాలు / మద్యంతో.. 

తెల్ల సాక్సుల‌పై ప‌డిన బురద మరకలను తొలగించడానికి మీరు ఆల్క‌హాలు / మద్యం ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితాలు ఉంటాయి. దీనిని మ‌ర‌క‌లు అంటిన భాగంపై రుద్దడంతో మ‌ర‌క‌లు పోతాయి. దీని కోసం ఒక కప్పు నీటిలో నిమ్మకాయను రుద్దే ఆల్కహాల్ మిక్స్ చేసి, ఈ మిశ్రమంలో సాక్స్ ను ఉంచాలి. కాసేపటి తర్వాత సాక్సును బ‌య‌ట‌కు తీసి బాగా రుద్దాలి. దీంతో మ‌ర‌క‌లు పోతాయి. అయితే, సాక్సుల‌ను శుభ్రం చేయ‌డం కోసం బ్ర‌ష్ ల‌ను ఉప‌యోగించ‌కూడ‌దు. ఎందుకంటే సాక్సులు చాలా సున్నితమైనవిగా ఉంటాయి.

click me!