అందంగా ఉండాలనే కోరిక ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది. దానికోసం పాపం వారు చాలా చేస్తారు. ఏవేవో క్రీములు, ఆయిల్స్ వాడేస్తూ ఉంటారు. వేలకు వేలు ఖర్చు చేసి మేకప్ సామాన్లు కొనేసి.. వాటిని కూడా రాసేసుకుంటూ ఉంటారు. అంతేనా... ఇంట్లో అమ్మలు, అమ్మమ్మలు చెప్పే చిట్కాలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే... చాలా మంది అమ్మాయిలకు ఎక్కువగా స్లీవ్ లెస్ వేసుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ.. తమ డార్క్ అండర్ ఆర్మ్స్ కారణంగా ఆ ధైర్యం చేయరు.