తేనె, నిమ్మకాయ
తేనె, నిమ్మకాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటానికే కాకుండా.. స్కిన్ కేర్ గా కూడా ఉపయోగపడుతుంది. మెడ నలుపును పోగొట్టడానికి 1 లేదా 2 టీ స్పూన్ల తేనెను తీసుకుని అందులో సగం నిమ్మకాయ రసాన్ని వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మెడపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇలా తరచుగా చేస్తే మెడ నలుపు పూర్తిగా పోతుంది.
పసుపు, మజ్జిగ
పసుపు, మజ్జిగతో కూడా మీరు ఎన్నో చర్మ ప్రయోజనాలను పొందొచ్చు. ముఖ్యంగా మెడ నలుపును సులువుగా పోగొట్టొచ్చు. ఇందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులో 2 టీ స్పూన్ల మజ్జిగను వేయండి. దీనిలోనే అర టీస్పూన్ పసుపు వేసి కలపండి. దీన్ని మెడకు బాగా పట్టించండి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కొన్ని రోజుల్లోనే మీ మెడను అందంగా మారుస్తుంది.