హెన్నాలో ఇది కలిపి పెడితే.. మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది, పొడుగ్గా పెరుగుతుంది

First Published | Sep 26, 2024, 11:27 AM IST

హెన్నా మన జుట్టుకు  ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. దీన్ని జుట్టుకు పెట్టడం వల్ల వెంట్రుకలు నల్లగా కావడమే కాదు.. పొడుగ్గా పెరుగుతుంది. అయితే మీరు హెన్నాలో కొన్నింటిని కలిపి జుట్టుకు పెడితే మీ జుట్టు నల్లగా, షైనీగా మారుతుంది. 

ఈ రోజుల్లో చాలా మంది జుట్టు స మస్యలతో బాధపడుతున్నారు. హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, ఆయిలీ హెయిర్, చుండ్రు, తెల్లజుట్టు వంటి వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ తగ్గించుకునేందుకు ఆడవారు మార్కెట్ లో దొరికే నూనెలను, షాంపూలతో పాటుగా ఎన్నో ప్రొడక్ట్స్ లను వాడుతుంటారు. ఎంతో ఖర్చు చేస్తుంటారు. అయినా ఈ సమస్యలు తగ్గాయా అంటే అదీ ఉండదు. 
 

నిజానికి జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి ఒకప్పుడు హెన్నాను బాగా వాడేవారు. నేటీకీ చాలా మంది గోరింటాకునే ఉపయోగిస్తుంటారు. నేచురల్ కలర్, థెరప్యూటిక్ హెన్నా మన జుట్టుకు మంచి రంగును  ఇవ్వడమే కాకుండా.. జుట్టును బలంగా చేస్తుంది.

ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే జుట్టు బలంగా, మంచి షైనీగా, మంచి రంగులో ఉండాలంటే హెన్నాలో ఏం కలిపి జుట్టుకు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


జుట్టుకు గోరింటాకు ప్రయోజనాలు

హెన్నా మన జుట్టుకు సహజ రంగును ఇవ్వడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది మన జుట్టు మూలాలను కూడా బలంగా చేస్తుంది. అలాగే నెత్తిమీద చుండ్రు లేకుండా చేస్తుంది. ఇంతేకాదు జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను కూడా తగ్గిస్తుంది. 

రెగ్యులర్ గా మెహందీని జుట్టుకు వాడటం వల్ల మీ జుట్టు అందంగా మెరిసిపోతుంది. అలాగే బాగా పెరుగుతుంది కూడా. అయితే మీరు గోరింటాకులో కొన్ని పదార్థాలను కలిపి వాడితే మీరు దీని నుంచి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మెరిసే జుట్టు కోసం హెన్నాలో ఏం కలపాలంటే? 

టీ ఆకులు

హెన్నాలో టీ ఆకులను మిక్స్ చేసి జుట్టుకు పెడితే వెంట్రుకలు నల్లగా అవుతాయి. ఇందుకోసం ముందుగా టీ ఆకులను నీళ్లలో మరిగించండి. ఇవి చల్లారిన తర్వాత వడకట్టి ఆ టీ నీళ్లలో గోరింటాకును వేసి బాగా మరిగించండి. ఈ టీ వాటర్ మన జుట్టుపై ఒక రక్షిత పొరను ఏర్పరుస్తుంది. దీనిని అప్లై చేయడం వల్ల జుట్టు తెగిపోయే అవకాశం ఉండదు. అలాగే మీ జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు బలంగా కూడా ఉంటుంది. 

మందార పువ్వులు

అవును హెన్నాలో మీరు మందార పువ్వులను కూడా వేయొచ్చు. ఇందుకోసం ఎండిన మందార పువ్వులను మెహందీలో వేయండి. దీన్ని జుట్టుకు పెట్టడం వల్ల మీ జుట్టు రంగు మెరుగుపడుతుది. ఈ మందార పువ్వులు జుట్టుకు నేచురల్ కలర్ ను ఇస్తాయి.

అలాగే జుట్టు బాగా పెరిగేలా చేయడానికి సహయపడుతుంది. ఇందుకోసం ఎండిన మందార పువ్వులను పొడిగా చేసి గోరింటాకు పేస్ట్ లో వేసి జుట్టుకు పెట్టండి. ఇది మీ జుట్టును అందంగా, మెరిసేలా చేస్తుంది. 

మెంతులు 

హెన్నాలో మెంతులను కూడా కలపొచ్చు. ఇందుకోసం రాత్రంతా మెంతులను నానబెట్టండి. ఉదయం వీటిని గ్రైండ్ చేసి గోరింటాకు పేస్ట్ లో కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పెట్టడం వల్ల చుండ్రు తగ్గుతుంది. అలాగే జుట్టు మృదువుగా అవుతుంది. అందంగా మెరిసిపోతుంది. మెంతుల్లో ఉండే పోషకాలు జుట్టును స్ట్రాంగ్ గా, హెల్తీగా ఉంచుతాయి.

కలబంద

హెన్నాలో ఫ్రెష్ కలబంద గుజ్జును మిక్స్ చేసి జుట్టుకు పెడితే మీ జుట్టు బాగా హైడ్రేట్ గా ఉంటుంది. కలబంద మన జుట్టును మృదువుగా, బలంగా చేస్తుంది. అంతేకాదు దీన్ని జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు మంచి షైనీగా కనిపిస్తుంది.

అంతేకాకుండా దీన్ని పెట్టడం వల్ల మీరు తలస్నానం చేసిన తర్వాత  జుట్టు పొడిబారినట్టుగా, నిర్జీవంగా అస్సలు కనిపించదు. కలబంద జెల్ లో ఉండే పోషకాలు, తేమ మన జుట్టుకు బలాన్ని ఇస్తాయి. 
 

గుడ్డు

గుడ్లు ప్రోటీన్ కు మంచి వనరులు. వీటిని హెన్నాలో కలిపి జుట్టుకు పెడితే మీ జుట్టుకు అదనపు పోషణ అందుతుంది. గుడ్లు మన జుట్టును బలంగా చేస్తాయి. అలాగే జుట్టు మరింత షైనీగా కనిపించేలా చేస్తాయి. అంతేకాకుండా గుడ్లు జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.

అలాగే జుట్టు తెగిపోవడం తగ్గుతుంది. రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది. కోడిగుడ్లను గోరింటాకు ద్రావణంలో మిక్స్ చేసి జుట్టుకు పెడితే మీ జుట్టు హెల్తీగా, స్ట్రాంగ్ గా ఉంటుంది. 
 

click me!