ఎండాకాలంలో బయట, ఇంట్లోనే కాదు వంటగది కూడా చాలా వేడిగా మారుతుంది. బెడ్ రూం, హాల్ ను అయితే ఏసీ, కూలర్ తో చల్లగా చేయొచ్చు. కానీ వంటింట్లో ఫ్యాన్ కూడా ఉండదు. ఇంకేముందు అన్నం, కూరలు, టిఫిన్లు వండటంతో వంటగది పూర్తిగా నిప్పుల కుంపటిలా మారుతుంది. ఎండాకాలంలో వంటగదిలో అస్సలు ఊపిరాడదు. దీనివల్ల వంట చేయడం కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా వేడివల్ల వంట కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ పూర్తిగా పోతుంది. అయితే కొన్ని చిట్కాలతో వంట చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోవచ్చు. అదెలాగంటే?
తేలికపాటి భోజనం
ఈ ఎండాకాలంలో తేలికపాటి భోజనం చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల వంట చాలా తొందరగా తయారవుతుంది. ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది.అలాగే శాండ్విచ్ లు వంటి ముందుగానే తయారు చేసే ఆహారాన్ని ఎంచుకోండి. మీరు శాండ్విచ్ లేదా సలాడ్ తయారు చేస్తుంటే అందులో ఉపయోగించే పదార్థాలను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు వంటగదిలో ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం రాదు.
ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఉపయోగించండి
ఇది టెక్నాలజీ యుగం. అలాగే ప్రతి ఒక్కరూ ప్రతి పనికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మీరు కూడా వంటకు కావాల్సిన ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఉపయోగించొచ్చు. ఇది మన పనిని సులభతరం చేస్తుంది. ఇది మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. చాలా కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక పనిలో లేదా పిల్లలు తమ చదువులో బిజీగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో కొన్ని వంటగది ఉపకరణాలు మీకు బాగా సహాయపడతాయి.
అలాగే వంటగదిలో వేడిని తగ్గించడానికి కూడా ఇవి పనిచేస్తాయి. వేడిని తగ్గించాలనుకుంటే మాత్రం ఎలక్ట్రిక్ కుక్వేర్, ఓవెన్ వంటి విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది. వేడి కూడా రాదు.
ఆల్కహాల్
ఆల్కహాల్ డీహైడ్రేట్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మిమ్మల్ని మరింత డీహైడ్రేషన్ బారిన పడేస్తుంది. అందుకే ఆల్కహాల్ ను తాగకండి. ఈ సీజన్ లో వీలైనంత ఎక్కువ నీళ్లను తాగండి. అప్పుడే మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. నార్మల్ వాటర్ ను తాగాలనిపించకపోతే జ్యూస్ లేదా హెర్బ్ డ్రింక్స్ ను తాగండి. అలాగే మీ ఆహారంలో మసాలా దినుసులు తక్కువగా చేర్చండి.
వంటగదిలో లైట్లు
వంటగదిలో పనిలేకపోతే లైట్లను ఆఫ్ చేయండి. వంటింట్లో ప్రకాశవంతమైన బల్బులు ఉంటే వాటిని వెంటనే మార్చండి. ఎందుకంటే ఇవి వేడిని సృష్టిస్తాయి. అందుకే వంటగది వేడిగా ఉంటుంది. ఇలాంటి బల్బులు ఉంటే ఎల్ ఈడీ లైట్లను పెట్టండి. లేదా సీఎఫ్ఎల్ లైట్లను ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే ఇవి ఇంటిని చల్లబరుస్తుంది.