ప్లాస్టిక్ బాటిళ్లను 5 నిమిషాల్లో క్లీన్ చేయడం ఎలా?

First Published May 9, 2024, 11:17 AM IST

ఎండాకాలం వచ్చిందంటే ఫ్రిజ్ మొత్తం వాటర్ బాటిళ్లతో నిండిపోతుంది. అయితే ఆడవాళ్లకు ఈ వాటర్ బాటిళ్లను క్లీన్ చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో మీరు ఈ బాటిళ్లను జస్ట్ 5 నిమిషాల్లోనే క్లీన్ చేయొచ్చు. అదెలాగంటే? 
 

ఎండాకాలం వచ్చిందంటే చాలు వాటర్ బాటిల్స్ ను కూడా ఫ్రిజ్ లో పెడుతుంటారు. ఎండాకాలంలో ఇది చాలా కామన్. మండుతున్న ఎండలకు చల్ల చల్లగా నీళ్లను ప్రతి ఒక్కరూ తాగుతుంటారు. అయితే బాటిళ్లను ఫ్రిజ్ లో పెట్టడం సంగతి పక్కన పెడితే.. బాటిళ్లను నింపి వాడిన కొన్ని రోజుల్లోనే వాటిలోంచి వాసన రావడం మొదలవుతుంది. అలాగే వాటర్ బాటిళ్లపై నీళ్ల మరకలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి బాటిళ్లను ఉపయోగించడం వల్ల అపరిశుభ్రత లేదని అనుకుంటారు. అలాగే ఇలాంటి బాటిళ్లను వాడటం వల్ల ఎన్నో వ్యాధులు కూడా వస్తాయి. 
 

చాలా మంది మురికి వాటర్ బాటిళ్లను శుభ్రం చేయడానికి చాలా టైం తీసుకుంటారు. అయినా బాటిళ్లు పూర్తిగా క్లీన్ అవ్వవు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో మీరు వాటర్ బాటిళ్లను క్లీన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ప్లాస్టిక్ బాటిల్ ను 30 సెకన్లలో శుభ్రం చేయడం ఎలా?

దీని కోసం మీరు నీళ్లను, ముతక ఉప్పును తీసుకోవాలి. ఈ రకమైన ఉప్పును మీరు మార్కెట్లో సులభంగా కొనొచ్చు. వాటర్ బాటిల్స్ ను శుభ్రం చేయడానికి ముతక ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా బాటిల్ లో  నీళ్లు,  కొద్దిగా ఉప్పును కలపండి. ఇప్పుడు ఈ ఉప్పు నీటిని బాటిల్ లోపల పోయండి. అయితే మూత సరిగ్గా మూయాలి. లేదంటే వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు బాటిల్ ను ఎంత ఎక్కువగా షేక్ చేస్తే బాటిల్ అంత క్లీన్ అవుతుంది. 

మౌత్ ఫ్రెషనర్ 

దుర్వాసన చెడు వాసన వచ్చే వాటర్ బాటిల్ ను క్లీన్ చేయడానికి ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మౌత్ ఫ్రెషనర్ ను కేవలం నోటిని శుభ్రపరచడానికి మాత్రమే కాకుండా బాటిళ్లను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా బాటిల్ లోపల కొద్దిగా నీళ్లు, కొద్దిగా మౌత్ ఫ్రెష్నర్ మిక్స్ చేయండి. ఆ తర్వాత బాటిల్ ను బాగా షేక్ చేయండి. 
 

ముడిబియ్యం, బేకింగ్ సోడా

ముడి బియ్యం, 1 టీస్పూన్ బేకింగ్ సోడా, 2 టీస్పూన్ల వైట్ వెనిగర్ ను ఉపయోగించి కూడా మీరు బాటిల్ ను శుభ్రం చేయొచ్చు. అయితే వెనిగర్ నిష్పత్తిలో ముడి బియ్యాన్ని కూడా జోడించాలి. వీటిని బాటిల్ లోపల వేడి బిగ్గరగా మూత పెట్టి బాటిల్ ను బాగా షేక్ చేయండి. ఆ తర్వాత వీటిని తీసేసి సబ్బు, నీటితో శుభ్రం చేసుకోండి. అయితే వెనిగర్ వాసన బాటిల్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బాటిల్ ను క్లీన్ చేసిన తర్వాత బాటిల్ ను కాసేపు అలాగే తెరిచి ఉంచండి. 
 

గోరువెచ్చని నీరు 

ఈ చిట్కాను చాలా మంది ఉపయోగిస్తుంటారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా లిక్విడ్ సబ్బు మిక్స్ చేసి బాటిల్ లో వేసి బాగా షేక్ చేయండి. కావాలనుకుంటే ఈ స్టెప్ లో  కొన్ని బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మీ బాటిల్ లోపల పేరుకుపోయిన మురికి, మరకలు తొలగిపోతాయి.  ఆతర్వాత మీరు బాటిల్ క్లీనింగ్ బ్రష్ తో కూడా శుభ్రం చేయొచ్చు. 

click me!