ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవడం ఎలా..?

First Published | Jan 12, 2023, 1:30 PM IST

పార్లర్ కి వెళ్లాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని అనే చెప్పొచ్చు. మరి ఖర్చు లేకుండా.. హెయిర్ స్పా ఇంట్లోనే చేసుకోవడం ఎలాగో చూద్దాం. కేవలం ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ఈ హెయిర్ స్పా  చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

తరచూ హెయిర్ స్పా చేసుకోవడం వల్ల... జుట్టు బలంగా, ఆరోగ్యంగా మారడంతో పాటు.. అనేక రకాల సమస్యలను పరిష్కరించవచ్చు. అయితే.. తరచూ హెయిర్ స్పా చేసుకోవాలి అంటే పార్లర్ కి వెళ్లాలి. పార్లర్ కి వెళ్లాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని అనే చెప్పొచ్చు. మరి ఖర్చు లేకుండా.. హెయిర్ స్పా ఇంట్లోనే చేసుకోవడం ఎలాగో చూద్దాం. కేవలం ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ఈ హెయిర్ స్పా  చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
 

1.కొబ్బరి పాలతో స్పా....
కొబ్బరి తినడం మీ చర్మానికి, కళ్ళకు మంచిది అయితే, మీ జుట్టుకు కొబ్బరి మిల్క్ స్పాని ఇవ్వడం వల్ల మీ జుట్టుని మళ్లీ ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఒక కప్పు కొబ్బరి పాలను మీ జుట్టుకు మసాజ్ చేయండి,  మీ జుట్టు పొడవు ని బట్టి కొబ్బరి పాల క్వాంటిటీ తీసుకోవాలి.  ఇప్పుడు మీ తల చుట్టూ టవల్ చుట్టి 15-20 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. తర్వాత శుభ్రం చేసుకోండి. కనీసం వారానికి ఒకసారి దీన్ని అనుసరించండి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.
 

Latest Videos


2.ఆరోగ్యకరమైన, బలమైన జుట్టు కోసం.. ఎగ్ తో స్పా

చర్మం, జుట్టు సంరక్షణలో కోడిగుడ్డు కీలక పాత్ర పోషిస్తుంది.  తేనె , ఆలివ్ నూనెతో 1 గుడ్డు కలపండి. ఈ స్మూత్ హెయిర్ మాస్క్‌ని మీ స్కాల్ప్ , హెయిర్‌కి అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయండి. రెండవ వాష్ తర్వాత గుడ్డు వాసన పోతుంది చింతించకండి. జుట్టు మాత్రం బలంగా మారుతుంది.

3.జుట్టు రాలే సమస్యకు.. గ్రీన్ టీ మాస్క్
మీరు నిరంతరం జుట్టు రాలడం గురించి ఆందోళన చెందుతుంటే, మీ స్కాల్ప్‌ను చక్కగా శుభ్రపరచడానికి దీన్ని చేయండి. చాలా సార్లు, మన శిరోజాలు మురికితో మూసుకుపోతాయి, ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. గ్రీన్ టీ అన్ని మురికి కణాలను కడిగి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. 1-2 గ్రీన్ టీ బ్యాగ్‌లను వేడి నీటిలో నానబెట్టి, 5 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు గ్రీన్ టీ నీటిని చల్లారనివ్వాలి. అదే నీటిని మీ తలపై పోసి, మీ తలపై సున్నితంగా మసాజ్ చేయండి. మీరు దీన్ని ప్లేన్ వాటర్‌తో కూడా శుభ్రం చేసుకోవచ్చు.

4.చుండ్రు, దురద ను తొలగించానికి పోషకమైన హెయిర్ మాస్క్..

హెయిర్ కండీషనర్ 1 - 2 టేబుల్ స్పూన్లు, 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టీస్పూన్ గ్లిజరిన్,  పావు టీస్పూన్ వెనిగర్  - ఒక గిన్నెలో అన్ని జుట్టు పోషణ పదార్థాలను కలపండి. ఈ ప్యాక్‌ని మీ జుట్టు మూలాలకు అప్లై చేసి, 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై శుభ్రం చేసుకోండి.
 

hair care

5.పొడి, పెళుసుగా మారిన జుట్టుకోసం.. అరటి,ఆలివ్ నూనె స్పా..
పొడిబారిన, చిట్లిన జుట్టును మళ్లీ మంచిగా  చేసుకోవడానికి  ఒక టేబుల్ స్పూన్ కండీషనర్, సగం గుజ్జు అరటిపండు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు మరియు 2-3 చుక్కల లావెండర్ తీసుకోండి.  వీటన్నింటిని కలిపి మాస్క్‌లా తయారు చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి. ఇది మీకు తక్షణమే మృదువైన, మెరిసే జుట్టును ఇస్తుంది.

banana hair

6.జిడ్డు, చుండ్రు తొలగించే హెయిర్ స్పా..
రైస్ వాటర్ హెయిర్ స్పా
రైస్ వాటర్ జుట్టుకు అందాన్ని ఇస్తుంది. షాంపూ, కండిషనింగ్ తర్వాత దాన్ని ఉపయోగించండి, అది రోజుకు ఒకసారి లేదా వారానికి ఒకసారి. బియ్యం నీటిని తలకు బాగా పట్టించాలి.ఇది రెండు నుండి ఐదు నిమిషాలు ఉంచి.., ఆపై శుభ్రం చేయాలి. ఇలా చేస్తే.. జుట్టు సమస్యలు తగ్గి.. మీ హెయిర్ మరింత అందంగా మారడానికి సహాయం చేస్తుంది.

click me!