జుట్టు ఒత్తుపెరగాలంటే ఏం చేయాలి..?

First Published Jan 12, 2023, 12:27 PM IST

మనం ఉపయోగించే రసాయనాలతో నిండిన షాంపూలు, నూనెలను ఉపయోగించడం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి.. రసాయనాలు లేని సహజ ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల జుట్టురాలే సమస్యను తగ్గించవచ్చు.

జుట్టు ఒత్తుగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. జుట్టు మృదువుగా, పొడవుగా మెరుస్తూ ఉంటే.. చాలా ఆనందం కలుగుతుంది. అలా కాకుండా.. తరచూ కుప్పలు కుప్పలుగా జుట్టు ఊడిపోతూ ఉ:టే  చాలా బాధగా ఉంటుంది. మనమందరం... సిల్కీగా, ఎగురుతూ ఉండే జట్టును కోరుకుంటాం. జుట్టు మనలో విశ్వసాన్ని పెంచుతుంది.

సాధారణంగా షాంపూ చేసేటప్పుడు లేదా జుట్టును బ్రష్ చేస్తున్నప్పుడు లేదా జుట్టుకు నూనె రాసేటప్పుడు వెంట్రుకలు రాలిపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. మనలో చాలా మంది చాలా తక్కువ, నిర్జీవమైన జుట్టు సమస్యను ఎదుర్కొంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా... జుట్టు రాలిపోవడం మొదలౌతుంది.

hair care

మనం ఉపయోగించే రసాయనాలతో నిండిన షాంపూలు, నూనెలను ఉపయోగించడం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి.. రసాయనాలు లేని సహజ ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల జుట్టురాలే సమస్యను తగ్గించవచ్చు.

hair care

జుట్టు దాని మూలాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఆహారం అవసరం. జుట్టు పోషకాలతో కూడిన మంచి హెయిర్ ఆయిల్ దానిని పొందడానికి సహాయపడుతుంది. డీప్ న్యూరిష్మెంట్ ఆర్గానిక్ హెయిర్ ఆయిల్‌ను వారానికి మూడుసార్లు ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

hair colouring

తలని శుభ్రంగా ఉంచుకోవడం , కడిగిన తర్వాత కండిషన్ చేయడం కూడా అవసరం. సహజ నూనెలను తొలగించకుండా, ఎటువంటి కఠినమైన రసాయనాలు లేకుండా జుట్టుకు పోషణను అందించే ఏదైనా మాయిశ్చరైజింగ్ షాంపూని ఉపయోగించడం. అదనపు పోషణ , రక్షణ సేంద్రీయ షాంపూ దీన్ని చేయడంలో సహాయపడుతుంది. 

hair care

జుట్టు పొడిగా ఉండకుండా.. అదనపు పోషణ, రక్షణ కోసం హెయిర్ సీరం ఉపయోగించాలి. ఒకసారి సీరమ్ అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. పొడి, చల్లని గాలి నుండి కాపాడటానికి ఉపయోగపడుతుంది.

hair

పోషకాహార లోపంతో బాధపడినప్పుడు కూడా జుట్టు రాలుతుంది. దానికి తగిన చికిత్స తీసుకుంటే.. ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకుంటే కూడా...జుట్టు రాలే సమస్య నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

click me!