ఇంట్లో టైల్స్ ను ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

First Published | Dec 16, 2024, 11:10 AM IST

ఈ రోజుల్లో చాలా మంది ఇండ్లలో టైల్సే ఉన్నాయి. అయితే ఈ టైల్స్ పై మరకలు ఎక్కువగా అవుతుంటాయి. వీటిని సులువుగా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఈ రోజుల్లో చాలా మంది టైల్స్ నే వేయించుకుంటున్నారు. ఎందుకంటే ఇవి ఇంటిని మరింత అందంగా మార్చేస్తాయి. అలాగే వీటివల్ల ఇంటి లుక్ పూర్తిగా మారుతుంది. టైల్స్ అందంగా ఉన్నా.. వీటిపై మరకలు ఎక్కువగా అవుతుంటాయి. అలాగే ఈ మరకలు అంత సులువుగా పోవు కూడా. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో టైల్స్ పై ఉన్న దుమ్మును, ధూళిని శుభ్రం చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


టైల్స్ ను ఎలా శుభ్రం చేయాలి?

1. బేకింగ్ సోడా

బేకింగ్ సోడాతో టైల్స్ ను తలతలా మెరిసేలా చేయొచ్చు. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను వేసి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ను మురికిగా మారిన టైల్స్ కు రాయండి. దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. దీన్ని క్లీన్ చేయడానికి స్క్రబ్ చేయడానికి మెత్తని బ్రష్ ను యూజ్ చేయండి. దీన్ని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే టైల్స్ కు అంటుకున్న దుమ్ము, దూళి, సబ్బు వ్యర్థాలు సులువుగా తొలగిపోతాయి. 


2. వైట్ వెనిగర్ 

వైట్ వెనిగర్ టైల్స్ ను చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది. ఇందుకోసం వైట్ వెనిగర్ ను, నీళ్లను ఒకేమొత్తంలో తీసుకుని బాగా కలపండి. దీన్ని స్ప్రే బాటిల్లో పోయండి. ఆ తర్వాత మురికి టైల్స్ పై దీన్ని స్ప్రే చేయండి. దీన్ని 10 నుంచి 15 నిమిషాల తర్వాత మెత్తని గుడ్డతో స్క్రబ్ చేయండి. అలాగే టైల్స్ ను క్లీన్ చేయడానికి మీరు గోరువెచ్చని నీళ్లను ఉపయోగించండి. దీనివల్ల టైల్స్ నుంచి మంచి వాసన రావడమే కాకుండా మొండి మరకలు కూడా పోతాయి.
 

3.హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా

టైల్స్ ను క్లీన్ చేయడానికి మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడాను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఈ రెండింటిని ఒకేమొత్తంలో తీసుకుని కలిపి పేస్ట్ చేయండి. దీన్ని టైల్స్ కు అప్లై చేసి  15-20 నిమిషాలు అలాగే ఉంచండి ఆ తర్వాత మెత్తని బ్రష్ తో స్క్రబ్ చేయండి. దీనివల్ల టైల్స్ పై ఉన్న మొండి మరకలు, దుమ్ము, ధూళి సులువుగా వదిలిపోతాయి. కానీ ఇందుకోసం మీరు గోరువెచ్చని నీళ్లను ఖచ్చితంగా ఉపయోగించాలి. 

4. నిమ్మరసం, ఉప్పు

నిమ్మకాయలో ఉండే గుణాలు మొండి మరకలను కూడా ఇట్టే పోగొడుతాయి. ఇందుకోసం నిమ్మకాయను సగానికి కట్ చేయండి. ఈ నిమ్మరసాన్ని టైల్స్ కు రుద్దండి. ఈ రసంపై ఉప్పును చల్లి 10-15 నిమిషాలు అలాగే ఉంచి మెత్తని గుడ్డతో స్క్రబ్ చేసి గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. దీనివల్ల టైల్స్ పై ఉన్న మురికి,దుమ్ము ఈజీగా తొలగిపోతాయి.
 


5. డిష్ సబ్బు

ఇంటిని క్లీన్ చేయడానికి మీరు డిష్ సబ్బును కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం గోరువెచ్చని నీళ్లను ఒక బకెట్ లో తీసుకుని అందులో డిష్ సబ్బును కలపండి. ఒక మెత్తని గుడ్డను దీంట్లో ముంచి టైల్స్ పై రుద్దండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో టైల్స్ ను క్లీన్ చేయండి. దీనివల్ల టైల్స్ పై పడిన రోజువారి దుమ్ము, ధూళి తొలగిపోతాయి. 

Latest Videos

click me!