reuse oil
నూనెతోనే వంటలు టేస్టీగా అవుతాయి. నిజానికి వంటనూనె మన ఆరోగ్యానికి అంత చెడ్డదైతే కాదు. నూనె సరైంది కాకపోతేనే దీనివల్ల వ్యాధులు వస్తాయి. అందుకే వంట నూనెను కొనే ముందు ఏది మంచిది? ఏది చెడ్డదో తెలుసుకోవాలి. అయితే పూరీలకు, బజ్జీలకు నూనె ఎక్కువ అవసరమవుతుంది. అయితే ఒకసారి ఉపయోగించిన నూనెను తిరిగి ఉపయోగించడం మంచిది కాదని చాలా పరిశోధనలు వెల్లడించాయి. అయినప్పటికీ నూనెను తిరిగి ఉపయోగించాలా? వద్దా? అనేది మీరు వాడే నూనె రకంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు నూనెను తిరిగి ఉపయోగించాలనుకుంటే దానికి శుభ్రం చేయడం చాలా ముఖ్యమంటారు నిపుణులు.
Reusing Cooking Oil
పొద్దుతిరుగుడు, వేరుశెనగ వంటి కొన్ని రకాల నూనెలను తిరిగి వాడొచ్చు. ఈ రకం నూనెలను ఒకసారి వాడిన తర్వాత మళ్లీ అదే వేడిలో వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. అలాగే ఆలివ్ ఆయిల్, నెయ్యి, వెన్న వంటి నూనెలను తిరిగి ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదు.
cooking oil
ఆహారాలను వేయించడానికి నూనెను ఉపయోగించడం వల్ల నూనెలోని అణు నిర్మాణాలు విచ్ఛిన్నం అవుతాయి. అలాగే ఇది హానికరమైన సమ్మేళనాలను కూడా ఏర్పరుస్తుంది. వేయించడానికి ఉపయోగించే నూనెను పదేపదే వేడి చేస్తే అది ఈ ప్రక్రియను పెంచుతుంది. అలాగే ట్రాన్స్ ఫ్యాట్, ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇలాంటి నూనెలను ఉపయోగించడం వల్ల లేనిపోని రోగాల బారిన పడాల్సి వస్తుంది.
ఒకసారి ఉపయోగించిన నూనెను తిరిగి ఉపయోగించాలనుకుంట.. దానిని సరిగ్గా నిల్వ చేయడం చాలా అవసరం. నూనెలో ఉండే ఆహారం చిన్న కణాలను తొలగించి మీరు ఈ నూనెను వాడుకోవచ్చు.
cooking oil
నూనెను ఎలా శుభ్రం చేయాలి?
వాడిన నూనెను తిరిగి ఉపయోగించాలనుకుంటే.. ముందు వంట నూనెను బాగా శుభ్రపరచాలి. ఎందుకంటే ఈ నూనెలో ఉండే చిన్న చిన్న ఆహార కణాలు కాలిపోయి హానికరమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే వంట నూనెను ఒకసారి ఉపయోగించిన తర్వాత ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకసారి వాడిన నూనెలో ఆహార కణాలు కనిపిస్తే వాటిని శుభ్రం చేయడానికి నూనెను చల్లారనివ్వండి. తర్వాత క్లాత్ లేదా కాఫీ స్ట్రెయినర్ తో వడకట్టండి.
బంగాళాదుంపలను కొంచె లావు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి అందులో బంగాళాదుంప ముక్కలను వేయండి. ఈ బంగాళాదుంపలు బంగారు గోధుమ రంగులోకి మారే వరకు ఉంచండి. బంగాళాదుంపలు బంగారు రంగులోకి మారిన వెంటనే బయటకు తీయండి. బంగాళాదుంప ముక్కలు అన్ని మలినాలను గ్రహించి నూనె శుభ్రంగా ఉంటుంది.
ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ వంట నూనెను మూడు సార్లకు మించి తిరిగి ఉపయోగించకూడదు. ఒకసారి వాడిన నూనెను ఒకటి లేదా రెండు నెలలకు మించి ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు.