రబ్బరుకు చెక్ పెట్టండి
కుక్కర్ మూతపై ఉన్న రబ్బరు సులువుగా వంట చేయడానికి చాలా అవసరం. అయితే దీన్ని ఎప్పుడూ వాడుతుంటే అది వదులుగా మారుతుంది. ఇది వాటర్ లీకేజీకి దారితీస్తుంది. అందుకే వదులుగా ఉన్న రబ్బరు మూతను గట్టిగా చేయాలి. కుక్కర్ లో వంట అయిన తర్వాత ఈ రుబ్బరు మూతను చల్ల నీల్లలో ముంచండి. ఇది దీని లైఫ్ టైం ను పెంచుతుంది. అలాగే కుక్కర్ నుంచి వాటర్ లీకేజీ కాదు.
విజిల్ కండిషన్ చెక్ చేయండి
కుక్కర్ విజిల్ లో ఆహార కణాలు అస్సలు ఉండకూడదు. ఎందుకంటే వీటిలో ఏవైనా ఉంటే ఆవిరికి ఆటంకం కలుగుతుంది. ఇది లీకేజీకి దారితీస్తుంది. విజిల్ ని ఓపెన్ చేసి క్రమం తప్పకుండా చెక్ చేయండి. దీన్ని కుక్కర్ ను కడుగుందే ఈ పని చేయొచ్చు. విజిల్ ను బాగా శుభ్రం చేయడానికి బ్రష్ ను ఉపయోగించండి.