కేవలం తలకు కొబ్బరి పాలు మసాజ్ చేయడమే కాకుండా.. జుట్టు మొత్తానికి కూడా అప్లై చేయాలి. అప్పుడు జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. అంతేకాకుండా.. స్మూత్ గా కండిషనర్ గా కూడా పని చేస్తుంది. ఈ కొబ్బరి పాలు వాడితే.. జుట్టుకు మళ్లీ ప్రత్యేకంగా కండిషనర్ వాడాల్సిన అవసరం కూడా రాదు.
కొబ్బరి పాలు తలకు అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల నుంచి గంట పాటు అలానే వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల.. దానిలోని పోషకాలు జుట్టుకు అందుతాయి. జుట్టు తేమగా ఉండటానికి సహాయపడుతుంది. జుట్టు మరింత మృదువుగా మారాలి అంటే.. అదే కొబ్బరి పాలలో ఒక స్పూన్ తేనె కలపాలి. లేదంటే ఆలివ్ ఆయిల్ అయినా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల హెయిర్ మరింత మృదువుగా, పట్టుకుచ్చులా మారుతుంది.