నయనతార ఇంత యంగ్ గా కనిపించడం వెనక సీక్రెట్ ఏంటో తెలుసా..?

Published : Jan 22, 2023, 12:01 PM IST

కేవలం  ఎండాకాలం మాత్రమే కాదు... కాలంతో సంబంధం లేకుండా... ఆమె  ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతిసారీ ఆమె దానిని ఉపయోగిస్తారట.  

PREV
18
నయనతార ఇంత యంగ్ గా కనిపించడం వెనక సీక్రెట్ ఏంటో తెలుసా..?

నయనతార.. పరిచయం అక్కర్లేనిపేరు. దశాబ్ద కాలంగా... ఆమె తన నటన, అందంతో మనల్ని మరిపిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అనగానే ముందుగా నయనతార పేరు వినపడుతుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి కంటే... రెట్టింపు అందంతో ఆమె కనిపిస్తున్నారు. నిజంచెప్పాలంటే... ఆమె అసలు వయసుకన్నా కూడా పదేళ్లు తక్కువగా కనిపిస్తుంది. మరి ఆ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందాం.

28

నయనతార ఎక్కువ గా సహజ ఉత్పత్తులను ఉపయోగించడానికి ఇష్టపడతారు. కెమికల్స్ ఉండే ఉత్పత్తులను ఆమె పెద్దగా ఉపయోగించరు. ఎక్కువగా ఆయుర్వేద ఉత్పత్తులను మాత్రమే ఆమె ఉపయోగిస్తారు.

38

ఆమె సన్ స్క్రీన్ లోషన్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అది లేకుండా.. ఇంట్లో నుంచి  బయటకు అడుగుపెట్టరు. కేవలం  ఎండాకాలం మాత్రమే కాదు... కాలంతో సంబంధం లేకుండా... ఆమె  ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతిసారీ ఆమె దానిని ఉపయోగిస్తారట.

48

ఆమె తన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రెటెడ్ గా ఉంచుకుంటారు. దానికోసం ఆమె తరచూ... నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల... ఆమెకు మొటిమల సమస్య కూడా ఉండదట.

58

తన చర్మం అందంగా మెరుస్తూ కనపడటం కోసం ఆమె పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారట. విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లను ఆమె తీసుకుంటారు.  దాని వల్ల ఆమె సహజంగా అందంగా కనిపించడానికి సహాయపడుతుంది.

68
Nayanatara

ఆమె తన చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. దాని కోసం క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేసుకుంటూ ఉంటారు. రెగ్యూలర్ గా దీనని ఆమె ఫాలో అవుతూ ఉంటారట.

78
nayanatara

ఆమె తన జుట్టు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు.. కొబ్బరి నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె తప్ప.. మరేమీ ఆమె ఉపయోగించరట.

88

ఆమె మేకప్ చాలా తక్కువగా ఉపయోగిస్తారట. అంతేకాదు.. కంటికి  ఉపయోగించే కాజల్ కూడా... ఆమె చాలా సహజంగా ఉండేలా ఆమె చూసుకుంటుందట.

click me!

Recommended Stories