ఈ ఆయుర్వేద బ్యూటీ ట్రిక్స్ తో... అందంగా మెరిసిపోవచ్చు..!

First Published Jan 19, 2023, 1:27 PM IST

మార్కెట్లో లభించే ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు వాడితే... ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దానికి బదులు ఆయుర్వేద ఉత్పత్తులు వాడితే... అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అందంగా మెరిసిపోవాలనే కోరిక ఉంటే సరిపోదు. దాని కోసం కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలా అని.. మార్కెట్లో లభించే ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు వాడితే... ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దానికి బదులు ఆయుర్వేద ఉత్పత్తులు వాడితే... అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...

1.కలబంద గుజ్జు..
అందాన్ని మెరుగుపరచడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి... ప్రతిరోజూ కలబంద గుజ్జును ముఖానికి అప్లై చేయడం వల్ల... అందంగా మెరిసిపోవచ్చు. 


2.ఆయిల్ మసాజ్..
తలకు ఆయిల్ మసాజ్ అందరూ చేయించుకుంటారు. కానీ... శరీరానికి కూడా ఆయిల్ మసాజ్ చాలా అవసరం. తరచూ శరీరానికి ఆయిల్ మసాజ్ చేయించుకుంటే... రక్త ప్రసరణ బాగా జరిగి... అందంగా కనిపిస్తారు.

raw vegetable salad

3.పచ్చి కూరగాయలు..
మనలో చాలా మంది కూరగాయలు ప్రతిరోజూ తింటూ ఉంటారు. కానీ.. వారు ఉడకపెట్టుకొని వాటిని తింటూ ఉంటారు. కానీ... అలా కాకుండా పచ్చి కూరగాయలు, లేదంటే వాటి జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా అందంగా కనిపించవచ్చు.

Image: Getty Images


4.తేనె..
తేనె ఆహారంలో భాగం చేసుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ... అదే తేనెతో తరచూ మన పెదాలకు మసాజ్ చేస్తే... అవి మరింత మృదువుగా, అందంగా కనిపిస్తాయట.


5.ఉసిరి...
ఉసిరిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు.. నిమ్మకాయ, నారిజలో నూ విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల కూడా తొందరగా వయసు పెరగకుండా కాపాడుకోగలం.

milk bath


6.పాల స్నానం...
నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం... పాలతో స్నానం చేయడం వల్ల... చర్మం మృదువుగా, ఫ్లాలెస్ గా కనిపిస్తుంది. అందాన్ని రెట్టింపు చేస్తుంది

7.వేప నీరు..
వేపాకు నీటితో స్నానం చేయడం, లేదంటే ముఖాన్ని కడుక్కోవడం, లేదంటే తాగినా కూడా చర్మం పై అద్భుతాలు చేస్తుంది.

8.పసుపు, చందనం...
పసుపు, చందనాల కాంబినేషన్ కూడా... మన అందాన్ని రెట్టింపు చేస్తుంది. స్నానం చేసే సమయంలో లేదంటే... మామూలుగా అయినా... వీటిని ముఖం, శరీరానికి రాసుకోవాలి.

click me!