తలపై వెంట్రుకలు ఎక్కువగా ఉంటే అమ్మాయిలు ఎవరైనా సంతోషిస్తారు కానీ... అవే వెంట్రుకలు.. ముఖం పై మొలిస్తే చాలా ఇబ్బంది పడతారు. ఆ అన్ వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ని ఎప్పటికప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్లి.. కష్టమైనా వాటిని తొలగిస్తారు. లేదంటే మార్కెట్లో దొరికే క్రీములు వాడతారు. పార్లర్ కి వెళితే.. వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ చేస్తారు. రెండూ పెయిన్ ఫుల్ గానే ఉంటాయి. అదే పెయిన్ లెస్ క్రీములు వాడదాం అంటే చర్మాన్ని పాడు చేస్తాయని, ట్యాన్ గా మారుస్తాయని భయం.
facial hair
మరి.. ఈ రెండు సమస్యలు లేకుండా సింపుల్ గా వాటిని తొలగించలేమా అంటే.. పరిష్కారం ఉంది. సింపుల్ గా.. మన ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో వాటిని ఈజీగా తొలగించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
1 నిమ్మరసం, పంచదార, తేనె.. ఈ మూడు మనకు ఇంట్లో సులభంగా లభించే పదార్థాలే. వీటితో.. అవాంఛిత రోమాలను ఈజీగా తొలగించవచ్చు. దీని కోసం ఈ మూడింటిని బాగా కలపాలి. దాంట్లోనే కొద్ది నీరు పోసి వేడి చేయాలి. వేడి చేయగానే ఇది వ్యాక్స్ లాగా తయారౌతుంది. దీనిని వెంటుక్రలు ఉన్నచోట రాసి.. తీసేస్తే సరిపోతుంది. సహజ పదార్థాలు కాబట్టి.. స్కిన్ రాషెస్ లాంటివి రావు. ఈజీగా వెంట్రుకలు తొలగిపోతాయి.
వోట్‌మీల్, అరటిపండు: ఓట్‌మీల్ , అరటిపండును బాగా కలిపి పేస్టులాగా తయారు చేసుకోవాలి. తర్వాత దీనిని స్క్రబ్బర్ గా వినియోగించాలి. ముఖంపై రాసి స్క్రబ్బింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల సహజంగా టోనింగ్, డెడ్ స్కిన్ తొలగించడంతో పాటు.. ముఖం మీద రోమాలను కూడా మనం తొలగించగలం. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్.. ముఖం పై వాపును కూడా నివారిస్తాయి. చర్మం అందంగా కనిపించడానికి కూడా సహాయం చేస్తుంది.
బంగాళదుంపలు, పప్పులు: బంగాళాదుంప రసం, తేనె , నిమ్మరసంతో కలిపి మెత్తని పేస్టు మాదిరి చేయాలి. ఈ పేస్టును ముఖంపై వెంట్రుకలు ఉన్న ప్రాంతంలో రాయాలి. అనంతరం అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. బంగాళాదుంప రసం ముఖంపై వెంట్రుకలు తక్కువగా కనిపించేలా చేస్తుంది.
గుడ్డులోని తెల్లసొన , మొక్కజొన్న పిండి: గుడ్డులోని తెల్లసొన , మొక్కజొన్న పిండిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ముఖంపై వెంట్రుకలు తగ్గుతాయి. ఈ మాస్క్ ని ముఖానికి రాసుకొని.. ఆరిపోయిన తర్వాత నీటితో కడగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వెంట్రుకలను తొలగించవచ్చు.
నేరేడు పండు, తేనె: నేరేడు పండు ని తేనెతో కలిపి దట్టమైన మాస్క్‌ని తయారు చేసుకోవాలి. తర్వాత దీనిని ముఖానికి సర్కిల్ మాదిరి రాయాలి. అనంతరం సున్నితంగా మర్దన చేయాలి. ఇది వెంట్రుకలను తొలగించడంలోనూ సహాయపడుతుంది.