కరివేపాకును ఇలా పెడితే మీ జుట్టు ఖచ్చితంగా పెరుగుతుంది

First Published | Sep 15, 2024, 2:26 PM IST

జుట్టు పెరగడానికి నూనెలను, షాంపూలను తరచుగా మార్చేవారు చాలా మందే ఉన్నారు. కానీ వీటిని మార్చినంత మాత్రానా మీ జుట్టు కొంచెం కూడా పెరగదు. కానీ కరివేపాకును ఒక పద్దతిలో పెడితే మాత్రం మీ జుట్టు ఖచ్చితంగా పెరుగుతుంది. 
 

ప్రతి  ఒక్క మహిళకు పొడవాటి,  ఒత్తైన జుట్టు ఉండాలనే కోరిక ఉంటుంది. ఇందుకోసం ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. షాంపూలను, నూనెలను మార్చడంతో పాటుగా ఇంటి చిట్కాలను కూడా పాటిస్తుంటారు.

జుట్టు పెరగాలంటే మాత్రం మీరు మార్కెట్ లో దొరికే వాటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే వీటిలో కెమికల్స్ ఉంటాయి. ఇవి మీ జుట్టు పెరగడాన్ని ఆపి, జుట్టు రాలేలా చేస్తాయి. 
 

curry leaves

జుట్టుకు నేచురల్ వస్తువులను వాడితేనే మీ జుట్టుకు అంత మంచిది. ఇవి మీ జుట్టు మీరు కోరుకున్న విధంగా పెంచుతాయి. ఇందుకోసం మీరు కరివేపాకును ఉపయోగించొచ్చు. అవును కరివేపాకు మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. 

జుట్టుకు కరివేపాకు ప్రయోజనాలు

దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో కరివేపాకు ఉంటుంది. ఎందుకంటే ప్రతి కూరలో కరివేపాకును వేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని చాలా కొని ఇంట్లో పెడ్తారు. జుట్టుకోసం మీరు ప్రత్యేకంగా ఎటునుంచో కొనాల్సిన అవసరం లేదు. కరివేపాకులో సహజ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టును పొడవుగా, నల్లగా మార్చడానికి సహాయపడుతుంది.
 

Latest Videos


కరివేపాకు హెయిర్ ప్యాక్ ను జుట్టుకు పెట్టడం వల్ల నెత్తిమీద ఉన్న చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది.  అలాగే  జుట్టును మృదువుగా, సిల్కీగా చేస్తాయి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందుకోసం కరివేపాకును ఎన్నో మార్గాల్లో పెట్టొచ్చు. ఎలా పెట్టినా ఇది మీ జుట్టును అందంగా మార్చేస్తుంది. 

కరివేపాకు, కొబ్బరి నూనె హెయిర్ ప్యాక్

ఇందుకోసం కరిలపాకును , కొబ్బరినూనె కలిపి వాడుకోవచ్చు. ఇది మీ జుట్టును బాగా పెరిగేలా చేస్తుంది. దీన్ని తయారుచేయడానికి ముందుగా కరివేపాకును నీళ్లతో బాగా క్లీన్ చేయండి. ఇప్పుడు మిక్సీలో కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పేస్ట్ లా  తయారుచేయండి.

ఈ పేస్ట్ ను ఒక గిన్నెలో ఉంచి దీనిలో  2 టీస్పూన్ల కొబ్బరి నూనె వేసి కలపండి. దీన్ని నేరుగా మీ జుట్టుకు అప్లై చేయండి. దీన్ని 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత జుట్టును క్లీన్ చేయండి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే పొడవుగా పెరిగేలా చేస్తుంది. 
 

కరివేపాకు, మెంతుల హెయిర్ ప్యాక్

మెంతులు జుట్టును పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. దీనిలో కరివేపాకు, షికాకాయను కలిపి వాడితే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం కరివేపాకును గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి.తర్వాతమెంతులను గ్రైండ్ చేసి దాంట్లో కలపండి.  ప్యాక్ ల తయారీకి మెంతి గింజలను నానబెట్టిన నీళ్లను ఉపయోగించండి. తర్వాత దీనిలో  పొడి వేసి కలిపి జుట్టుకు పెట్టండి.

20 నిమిషాల తర్వాత జుట్టును క్లీన్ చేయండి. ఈ హెయిర్ ప్యాక్ మీ జుట్టును షైనీగా చేస్తుంది. వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్స్ ను ట్రై చేయండి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. అలాగే మార్కెట్ లో దొరికే హెయిర్ ప్యాక్ లను వాడాల్సిన అవసరం కూడా రాదు. 

click me!