ముఖానికి ఫేస్ ప్యాక్ వేస్తున్నారా..? ఈ పొరపాట్లు చేయకండి..!

First Published | Sep 14, 2024, 1:07 PM IST

ఫేస్ ప్యాక్ వేసే సమయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. ఆ పొరపాట్ల కారణంగా..  ఫేస్ ప్యాక్ తో.. ముఖానికి రావాల్సిన అందం రాకపోగా...చర్మం సాగిపోయే ప్రమాదం ఉంది.

అందంగా కనిపించాలనే కోరికతో మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందులో ఒకటి ఫేస్ ప్యాక్ లు వేసుకోవడం.  కెమికల్స్ తో ఉన్నవో.. లేక.. ఇంట్లోనే కిచెన్ లో ఉండే కొన్ని వస్తువులో.. ఏవో ఒకటి ముఖానికి ఫేస్ ప్యాక్ లుగా వేస్తూ ఉంటాం. కానీ.. ఆ ఫేస్ ప్యాక్ వేసే సమయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. ఆ పొరపాట్ల కారణంగా..  ఫేస్ ప్యాక్ తో.. ముఖానికి రావాల్సిన అందం రాకపోగా...చర్మం సాగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం...

మీరు ముఖానికి ఫేస్ ప్యాక్  వేయడానికి ముందు... అసలు మీ స్కిన్ టైప్ తెలుసుకోవాలి. స్కిన్ టైప్ తెలీకుండా ఫేషియల్స్ వేయడం వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. ఉదాహరణకు మీది సెన్సిటివ్ స్కిన్ అనుకోండి... వాళ్లు.. ఎక్కువ సేపు ఫేషియల్ వేసుకోకూడదు. దాని వల్ల.. వారికి సమస్యలు ఎక్కువగా వస్తాయి.మీది స్కిన్ సెన్సిటివ్ అయితే... మీరు ఫేస్ కి కేవలం 10 నుంచి 15 నిమిషాలపాటు మాత్రమే ముఖానికి ఉంచాలి. అంతకంటే ఎక్కువ సమయం ఉంటే.. స్కిన్ కి చాలా హాని చేసేస్తుంది.

Latest Videos


ఇక.. స్కిన్ గ్లో రావాలని, అందంగా కనిపించాలని అనుకునేవారు ఎక్కువ మంది రెండు రోజులకు ఒకసారి ఇలా ఫేస్ ప్యాక్ వేస్తూ ఉంటారు. కానీ.. మరీ ఎక్కువగా ఫేస్ ప్యాకులు వేయడం మంచిది కాదు. దీని వల్ల స్కిన్ డ్రైగా మారుతుంది. అందుకే మరీ ఎక్కువగా  రాయకూడదు. నెలకోసారి ప్రయత్నించవచ్చు. కానీ.. మరీ రెగ్యులర్ గా ఫేస్ ప్యాక్ లు వేయడం మంచిది కాదు.
 

ఇంట్లో సహజ ఉత్పత్తులతో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నట్లయితే... వారానికి రెండుసార్లు  ట్రై చేయవచ్చు. అంతేకాదు.. ఎక్కువ అందం రావాలని కోటింగ్ ల మీద కోటింగ్స్ వేయకూడదు. సింగిల్ కోటింగ్ వేస్తే సరిపోతుంది. ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. గలీజ్ చేతులతో, మురికిగా ఉన్నప్పుడు.. ఆ చేతులతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే స్కిన్ ఎలర్జీలు  వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే.. ఈ పొరపాటు చేయకూడదు.
 

ఇక.. ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు వేసే డైరెక్షన్ చాలా ముఖ్యం. ఏ డైరెక్షన్ లో పడితే.. ఆ డైరెక్షన్ లో రాయకూడదు. చాలా మంది పై నుంచి కిందకు రాస్తూ ఉంటారు. కానీ.. అలా చేయకూడదు. కింద నుంచి మాత్రమే పైకి రాయాలి. ఇలా రాయకుంటే.. చర్మం సాగిపోయే ప్రమాదం ఉంది. సరిగా.. ఫేస్ ప్యాక్ రాస్తే... చర్మం సాగకుండా, టైట్ గా ఉంటుంది.

click me!