మెంతులతో ఈ గింజలు కలిపి తలకు రాస్తే... తెల్ల జుట్టు కూడా నల్లగా అవ్వాల్సిందే

First Published | Sep 14, 2024, 10:12 AM IST

మన వంటింట్లో దొరికే రెండు పదార్థాలతో మీ జుట్టు అన్ని సమస్యలను పరిష్కరించవచ్చు. ముఖ్యంగా జుట్టు మృదువుగా మారుతుంది.. కుదుళ్లు బలపడతాయి. తెల్ల జుట్టు సమస్య అయితే.. అస్సలు ఉండనే ఉండదు. మరి.. ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం...

 ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా  చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అంతేనా.. బయట కాలుష్యం కారణంగా విపరీతంగా జుట్టు రాలిపోవడం, ఉన్న నాలుగు వెంట్రుకలు కూడా కళా విహీనంగా కనిపించడం లాంటివి జరుగుతున్నాయి. ఉన్న జుట్టును కాపాడుకోవడానికి చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఖరీదైన నూనెలు, షాంపూలు వాడేస్తూ ఉాంటారు. అయితే.. అవేమీ లేకపోయినా కేవలం మన వంటింట్లో దొరికే రెండు పదార్థాలతో మీ జుట్టు అన్ని సమస్యలను పరిష్కరించవచ్చు. ముఖ్యంగా జుట్టు మృదువుగా మారుతుంది.. కుదుళ్లు బలపడతాయి. తెల్ల జుట్టు సమస్య అయితే.. అస్సలు ఉండనే ఉండదు. మరి.. ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం...

మీ ఇంట్లో  మెంతులు, కళోంజీ సీడ్స్( నల్ల జీలకర్ర) ఈ రెండూ ఉంటే చాలు. ఈ రెండింటితో  మీ ఐదు రకాల జుట్టు సమస్యలను పరిష్కరించవచ్చు. మరి.. ఈ రెండింటిని తలకు ఎలా పెట్టాలి..? ఎలా పెడితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

1. మొదటిది పొడవాటి జుట్టు.. నిజానికి అమ్మాయిలు అందరూ.. పొడవాటి జుట్టు కోరుకుంటారు.  అయితే.. ఆ వరం అందరినీ వరించకపోవచ్చు. అలాంటివారు.. ఈ మెంతులు, కళోంజీ గింజలను జుట్టు కు అప్లై చేయడం వల్ల కచ్చితంగా జుట్టు చాలా ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. చాలా తక్కువ సమయంలోనే మీరు రిజల్ట్ చూస్తారు.
 

Latest Videos


Frizzy Hair

2.ఇక.. ముఖ్యమైనది, ఎక్కువమంది ఫేస్ చేసే సమస్య జుట్టు రాలడం.  ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, బలమైన ఆహారం తీసుకున్నా కూడా.. జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. అలాంటివారు కూడా.. ఈ మెంతులు, కళోంజీ గింజల మిశ్రమాన్ని జుట్టుకు రాయడం వల్ల.. జట్టు రాలడం ఆగిపోతుంది.  కొత్త జుట్టు కూడా వస్తుంది కాబట్టి.. మళ్లీ జుట్టు ఒత్తుగా మారుతుంది.

3.ఇక..చాలా మంది పొడి జుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అదే.. ఈ రెండు గింజల మిశ్రమాన్ని జుట్టుకు రాస్తే... తల చాలా మాయిశ్చరైజ్డ్ గా మారుతుంది.  కుదుళ్లకు అందాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి. డ్రై హెయిర్ సమస్య అనేది ఉండనే ఉండదు. అంతేకాదు.. జుట్టు బలంగా మారుస్తుంది. జుట్టు బలహీనంగా ఉన్నప్పుడే వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. అదే జుట్టు కుదుళ్లు బలంగా ఉంటే.. ఆ సమస్య ఉండదు కదా.. ఫలితంగా.. మీ చాలా రకాల జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.

4.చివరగా చాలా ముఖ్యమైనది తెల్ల జుట్టు సమస్య. చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తోంది. 30 దాటిన వారిలోనూ విపరీతంగా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటివారు ఈ రెండు గింజల మిశ్రమాన్ని వాడితే.. తెల్ల వెంట్రుకల సమస్య ఉండదు. తెల్ల జుట్టు కూడా నల్లగా మారడం పక్కా...  కొత్త గా తెల్లగా మారేవి కూడా మారకుండా నల్లగానే ఉంటాయి. ఎక్కువ కాలం మీ గ్రెయిర్ సమస్యను కంట్రోల్ చేయవచ్చు.

మరి.. ఈ రెండింటిని జుట్టుకు ఎలా అప్లై చేయాలి అనే సందేహం మీకు కలగొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... ముందుగా.. కొబ్బరి నూనె తీసుకొని.. ఓ పాత్రలో వేసి వేడి చేయాలి. అందులోనే మెంతులు, కళోంజీ సీడ్స్ కూడా వేసి బాగా మరగనివ్వాలి.  కొబ్బరి నూనె రంగు మారే వరకు మరగనివ్వాలి. ఆ తర్వాత వేడి చేయడం ఆపేసి.. ఆ నూనె ఆరే వరకు ఆగాలి. ఇప్పుడు ఆ నూనెను.. తలకు బాగా పట్టించాలి. మంచిగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం కూడా చేయవచ్చు. లేదంటే.. రాత్రిపూట రాసి.. మరుసటి రోజు అయినా తలస్నానం చేయవచ్చు. వారానికి రెండు సార్లు అయినా.. ఈ నూనెను తలకు పట్టించడం వల్ల.. మీరు మెరుగైన ఫలితాలను చూస్తారు.
 

click me!