మొటిమలు, వాటి మచ్చలను తొలగించే అద్భుతమైన పరిష్కారం..!

First Published | Jun 29, 2021, 11:19 AM IST

మార్కెట్లో లభించే ఎన్ని క్రీములు రాసినా.. మొటిమలు తగ్గచ్చేమో కానీ...  మచ్చలు మాత్రం తగ్గవు. మరి  దీనికి పరిష్కారమే లేదా అంటే.. కేవలం వంటింటి చిట్కాలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని చెబుతున్నారు

వయసులో ఉన్న అమ్మాయిలందరినీ.. మొటిమల సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఆ మొటిమలు తగ్గిన తర్వాత కూడా.. దాని తాలూకు మచ్చలు కూడా వేధిస్తూనే ఉంటాయి.
undefined
మార్కెట్లో లభించే ఎన్ని క్రీములు రాసినా.. మొటిమలు తగ్గచ్చేమో కానీ... మచ్చలు మాత్రం తగ్గవు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కేవలం వంటింటి చిట్కాలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం..
undefined

Latest Videos


కొబ్బరి నూనెతో మొటిమలు, వాటి తాలుకూ మచ్చలను సులభంగా తొలగించవచ్చట. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని.. ఆ మొటిమల మచ్చలపై మసాజ్ చేయాలి. అలా ప్రతిరోజూ చేయడం వల్ల మొటిమల మచ్చలను పూర్తిగా తొలగించుకునే అవకాశం ఉంటుంది.
undefined
కలబంద గుజ్జు కూడా మొటిమల సమస్యను పూర్తిగా తగ్గిస్తుందట. ప్రతిరోజూ మొటిమల సమస్య ఉన్న ప్రాంతంలో ఈ కలబంద గుజ్జును రాయాలి. ఇలా ప్రతిరోజూ రాయడం వల్ల ఆ మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయట.
undefined
మనం వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడా కూడా మొటిమల సమస్యను పరిష్కరిస్తుందట. ఈ బేకింగ్ సోడాను నీటిలో కలిపి.. ఆ తర్వాత మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి. కొద్ది సేపటి తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా రాయడం వల్ల నల్ల మచ్చలు పూర్తి తగ్గిపోతాయి.
undefined
నిమ్మరసాన్ని పెరుగులో కలిపి.. ముఖానికి రాసుకోవాలి. అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మొటిమల సమస్యను పరిష్కరించవచ్చు.
undefined
చర్మం మృదువుగా మారడానికి, ముఖంపై మచ్చలు తొలగడానికి ఆముదాన్ని ఉపయోగించాలట. ఆముదంతో మృదువుగా మసాజ్ చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.
undefined
పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మొటిమల మచ్చలు తొలగించుకోవడానికి.. పసుపుతో ఏదో ఫేసియల్ మాస్క్ వేసుకుంటే సరిపోతుంది.
undefined
నమ్మసక్యంగా లేకపోయినా కందిపప్పు కూడా మొటిమల సమస్యను తగ్గిస్తుంది. దీనిలో బ్లీచింగ్ ఏజెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పప్పుని పిండిగా చేసి.. దానిని నీటిలో కలిపి.. ముఖానికి రాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ముఖం తాజాగా మెరిసిపోవడంతోపాటు.. మొటిమల మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి.
undefined
ఆరెంజ్ తొక్కల పొడి కూడా చర్మం అందంగా మెరిసిపోవడానికి సహాయం చేస్తుంది. ఒక టీ స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడిని తీసుకొని.. దానిని నీటిలో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల.. ముఖం అందంగా మెరుస్తుంది. అంతేకాకుండా.. మొటిమల మచ్చలు తొలగుతాయి.
undefined
click me!