పీరియడ్స్ క్రమం తప్పాయా..? ఇవి ట్రై చేయండి..!

First Published Jun 28, 2021, 3:17 PM IST

పీరియడ్స్ సరిగా రావడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పీరియడ్స్ ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. ఈ పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎక్కడా లేని నొప్పి, బాధ, చిరాకు కలగడం చాలా సహజం. నెల నెలా వచ్చి ఇబ్బంది పెడుతున్నాయని విసుక్కుంటాం కానీ.. ఏదో ఒక్క నెల రావడం ఆగినా కంగారుపడిపోతాం.
undefined
ప్రతి నెలా పీరియడ్స్ సరిగా రావడం లేదు.. అంటే.. మనలో ఏదో సమస్య ఉందనే అర్థం. అందుకే.. పీరియడ్స్ క్రమం తప్పితే.. అమ్మాయిలు కంగారు పడిపోతుంటారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే.. గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లడానికి ముందు.. కొన్ని వంటింటి చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల కూడా మనం ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
undefined
పీరియడ్స్ సరిగా రావడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
undefined
పీరియడ్స్ క్రమం తప్పినవారు ప్రతిరోజూ జీలకర్ర తీసుకోవడం వల్ల అవి మళ్లీ రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది. జీలకర్ర రోజూ తినడం కానీ.. జీరా వాటర్ తాగడం చేయవచ్చు. పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి కూడా ఇది సహాయం చేస్తుంది.
undefined
ప్రతిరోజూ దాల్చిన చెక్కను ఆహారంలో తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయట. లేదంటే.. వేడి పాలల్లో ఈ దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకున్నా ప్రయోజనం కలుగుతుందట.
undefined
ప్రతిరోజూ ఆహారంలో భాగంగా ఒక స్పూన్ పసుపు తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయట. దీని వల్ల శరీరంపై అవాంఛిత రోమాలు పెరగకుండా కూడా సహాయం చేస్తుందట.
undefined
ఇప్పటి వరకు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతాం.. బెల్లి ఫ్యాట్ తగ్గుతాం అని మనకు తెలుసు కానీ.. దీనిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయట.
undefined
పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భాయ పొరను మృదువుగా చేస్తుంది. దీని వల్ల పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మలబద్దకం సమస్యను కూడా తగ్గిస్తుంది.
undefined
click me!