ఉపయోగించే విధానం
ఇంటిని తుడవడానికి ముందుగా.. సగం బకెట్ నీళ్లను తీసుకుని అదులో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా, కల్లుప్పును వేసి బాగా కలపండి. దీంట్లోనే పచ్చ కర్పూరం పొడి, పసుపు పొడి వేడి కలపండి. ఇవన్నీ నీళ్లలో కరిగే వరకు బాగా కలపండి.
ఆ తర్వాత తర్వాత ఆ నీళ్లతో మీ ఇంటి తుడవండి. ఇలా చేయడం వల్ల నేల శుభ్రంగా ఉండటమే కాకుండా.. ఇంట్లోకి ఈగలు, చీమలతో పాటుగా చిన్న చిన్న కీటకాలు, పురుగులు కూడా రావు. కావాలనుకుంటే మీరు ఈ నీళ్లలో డెటాల్ లేదా లైజోల్ ను కూడా కలపొచ్చు.
ఈ వాటర్ తో కిచెన్ స్లాబ్ ను కూడా క్లీన్ చేయొచ్చు. దీనివల్ల కిచెన్ స్లాబ్ పై ఈగలు వాలవు. చీమలు అస్సలే రావు.