ఇలా చేస్తే.. ముక్కు మీదున్న నల్ల మచ్చలు తొందరగా తగ్గిపోతాయి

First Published | Oct 5, 2024, 10:26 AM IST

చాలా మందికి ముక్కుమీద నల్ల మచ్చలు ఉంటాయి. ఇదొక చర్మ సంబంధిత సమస్య. కానీ దీనివల్ల ముఖం చూసిన వెంటనే ఇదే కనిపిస్తుంది. అయితే ఈ మచ్చలను తొందరగా పోగొట్టడానికి ఒక చిట్కా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అదేంటంటే?

ఆడవాళ్లు అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చాలా మంది ఆడవారికి బుగ్గలు, ముక్కు మీద నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలు చాలా మొండివి. ఏం చేసినా పోవని ఆడవాళ్లు బాధపడుతుంటారు. 

నిజానికి ముక్కుమీదున్న ఈ బ్లాక్ హెడ్స్ అందాన్ని తగ్గిస్తాయి. మేకప్ వేసినా అవి మాత్రం క్లియర్ గా కనిపిస్తాయి. అందుకే ఈ సమస్య పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముక్కుమీదు బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిని పోగొట్టడానికి మార్కెట్ లో ఎన్నో ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని పెట్టినా మళ్లీ వస్తుంటాయి. అందులోనూ కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ చర్మాన్ని దెబ్బతీస్తాయి కూడా. 

అందుకే మీరు వీటిని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలను ఎంచక్కా వాడొచ్చు. ఇంటి చిట్కాలతో ముక్కుమీదున్న బ్లాక్ హెడ్స్ ను ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

కాయధాన్యాలు

కాయధాన్యాలతో కూడా మీరు ముక్కుమీదున్న బ్లాక్ హెడ్స్ ను సులువుగా తగ్గించుకోవచ్చని స్కిన్ కేర్ నిపుణులు అంటున్నారు. నిజానికి కాయధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు ఈ పప్పులు మన చర్మానికి కూడా ఉపయోగపడతాయి. కాయధాన్యాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లతో పాటుగా ఎన్నో రకాల విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉపయోగించి ముక్కుమీదున్న బ్లాక్ హెడ్స్ ను సులువుగా పోగొట్టొచ్చు. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. 

ఇందుకోసం 1 కప్పు ఎర్ర పప్పును తీసుకుని పేస్ట్ చేయండి. దీంట్లో 4 టీస్పూన్ల నిమ్మరసాన్ని వేసి బాగా కలపండి. ఈ పేస్ట్ ను ముక్కుమీదున్న బ్లాక్ హెడ్స్ పై అప్లై చేయండి. కొద్దిసేపటి తర్వాత కడిగేయండి.

ఆ తర్వాత మీ ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయండి. అయితే ఈ రెమెడీని ప్రయత్నించే ముందు ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి. జుట్టుకు అస్సలు పెట్టకూడదు. లేదంటే జుట్టు దెబ్బతింటుంది. 

ఈ విషయాలను గుర్తుంచుకోండి

రోజుకు 2 నుంచి 3 సార్లు ముఖాన్ని నీట్ గా కడుక్కోవాలి. అలాగే ఖచ్చితంగా ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయాలి. మీరు ముఖానికి ఏ ప్రొడక్ట్స్ ను పెట్టాలనుకున్నా ముందుగా ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి.మరీ ముఖ్యంగా స్కిన్ నిపుణుల సలహాతోనే ఉత్పత్తులను వాడండి.

Latest Videos


బ్లాక్ హెడ్స్ తొలగించడానికి ఏ వస్తువులను ఉపయోగించాలి?

కీరదోసకాయ, పెరుగుతో కూడా మీరు ముక్కుమీదున్న బ్లాక్ హెడ్స్ ను తొలగించొచ్చు. 

ముఖానికి కీరదోసకాయను పెడితే ఏమవుతుంది?

కీరదోసకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మంచి తేమను అందించడానికి బాగా సహాయపడతాయి. ఈ కీరదోసకాయల్లో ఉండే మూలకాలు ముఖంపై ఉన్న రంధ్రాలను లోతుగా క్లీన్ చేస్తాయి.అలాగే కీరదోసకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై ఉండే రంధ్రాల పరిమాణాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

పెరుగును ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు 

చర్మానికి పెరుగు కూడా ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే లక్షణాలు చర్మ వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. దీన్ని ముఖానికి ఉపయోగించడం వల్ల ముఖం చర్మం చాలా కాలం పాటు అందంగా, యవ్వనంగా ఉంటుంది. 
 

బ్లాక్ హెడ్స్ తొలగించడానికి బెస్ట్ హోం రెమెడీ ఏంటి?

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 టీస్పూన్ల పెరుగు ను వేయండి. దీంట్లోనే గ్రైండ్  చేసిన కీరదోసకాయ పేస్ట్ ను వేసి బాగా కలపండి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి చేతులతో ముక్కుపై ఉన్న నల్లమచ్చలకు పెట్టి కాసేపు మసాజ్ చేయండి. ఈ మిశ్రమం మంచి స్క్రబ్ లా పనిచేస్తుంది. ఈ స్క్రబ్ ను 5 నిమిషాల పాటు మసాజ్ చేసి కాటన్, వాటర్ తో శుభ్రం చేయండి. ఈ రెసిపీని తరచుగా ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. 

ఆలుగడ్డ, తేనెతో బ్లాక్ హెడ్స్ మాయం..

బంగాళాదుంపలను ముఖానికి రాసుకుంటే ఏమవుతుంది?

ఆలుగడ్డ ముక్కు, బుగ్గలపై ఉన్న నల్ల మచ్చలను పూర్తిగా పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఆలుగడ్డ మీ చర్మంలోని అదనపు నూనెను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. అంతేకాదు ముఖంపై ఉన్న తెల్ల, నల్ల మచ్చలను, ముడతలను, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి బాగా పనిచేస్తుంది. 

తేనెను ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

తేనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన చర్మాన్ని నేచురల్ గా ఎక్స్ ఫోలియేట్ చేయడానికి బాగా సహాయపడుతుంది. తేనెను ముఖానికి పెడితే ముఖ చర్మ రంధ్రాలు బాగా శుభ్రమవుతాయి. అలాగే ముఖం మృదువుగా చేయడానికి తేనె చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది చర్మాన్ని తేమగా చేయడానికి కూడా సహాయపడుతుంది.
 

బ్లాక్ హెడ్స్ తొలగించే బెస్ట్ హోం రెమెడీ

ముందుగా ఒక బంగాళాదుంపను తీసుకుని బాగా గ్రైండ్ చేయండి. దీనిలో 2 నుంచి 3 టీ స్పూన్ల తేనెను వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముక్కుమీదున్న బ్లాక్ హెడ్స్ మీద అప్లై చేయండి. ఇప్పుడు చేతులతో కొద్దిపాటి ఒత్తిడితో మసాజ్ చేయండి. ఈ మిశ్రమం ఫేస్ స్క్రబ్ లా పనిచేస్తుంది. ఈ స్క్రబ్ ను 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. అలాగే కాటన్, నీళ్లను శుభ్రం చేయండి. ఈ రెసిపీని తరచుగా ఫాలో అయితే ముక్కుమీదున్న నల్ల మచ్చలు తొందరగా తగ్గిపోతాయి. 

click me!