రాత్రిపూట ముఖానికి ఇవి పెడితే.. ఉదయానికల్లా అందంగా కనిపిస్తారు

First Published Oct 4, 2024, 5:21 PM IST

అందంగా కనిపించాలని, ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా ఉండేందుకు ఆడవాళ్లు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ రాత్రిపూట కొన్నింటిని ముఖానికి పెడితే ఉదయానికల్లా మీ అందం రెట్టింపు అవుతుంది.


అందమైన చర్మం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరకుంటారు. ఇందుకోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అయితే మీరు అందంగా కనిపించాలంటే మీరు కాస్ట్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ నే వాడక్కర్లేదు. ఇంట్లో దొరికే వాటిని పెట్టుకున్నా మీ ముఖ అందం రెట్టింపు అవుతుంది. 

ప్రతి మహిళకు మృదువైన, మంచి గ్లోయింగ్ స్కిన్ ఉండాలనే కోరిక ఉంటుంది. ఎందుకంటే ఇదే మన రూపాన్ని పెంచుతుంది. ఇందుకోసం కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడితేనే సరిపోదు.

సరైన చర్మ సంరక్షణ దినచర్యను అనుసరిస్తూ.. మంచి పోషకాహారం తింటే మీ స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. ఇందుకోసం మీరు కొన్ని సహజ ఉత్పత్తులను ఉపయోగించాల్సి ఉంటుంది.
 

అలాగే మీ చర్మాన్ని దుమ్ము, ధూళి, ఎండల నుంచి కూడా రక్షించాలి. అలాగే చర్మాన్ని కాలుష్యం నుంచి దూరంగా ఉంచాలి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేట్ గా ఉండటం చాలా అవసరం. నిపుణుల ప్రకారం.. రాత్రి పడుకునే ముందు ముఖానికి కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ను అప్లై చేస్తే  కొన్ని రోజుల్లోనే మీ అందం రెట్టింపు అవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఆరోగ్యకరమైన చర్మం కోసం సహజ ఉత్పత్తులు

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె ఒక్క జుట్టుకు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు. కొబ్బరి నూనె వల్ల కేవలం జుట్టుకు మాత్రమే కాదు మన చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అవును.. కొబ్బరి నూనె మన చర్మాన్ని లోతుగా తేమగా చేస్తుంది.

అలాగే కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడతాయి. మీ ముఖంపై మచ్చలు తగ్గిపోయి అందంగా కనిపించాలంటే రాత్రిపూట కొబ్బరి నూనె చేతులతో ముఖానికి అప్లై చేయండి. ఇది మీ ముఖ చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా చేస్తుంది. 
 

Latest Videos


అలోవెరా జెల్:  కలబంద జెల్ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి, జుట్టుకు, చర్మానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ అలోవెరా జెల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, హైడ్రేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ చికాకు నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. మీరు రాత్రిపూట పడుకునే ముందు ముఖానికి కలబంద జెల్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల మీ ఫేస్ ఉదయానికల్లా ఫ్రెష్ గా కనిపిస్తుంది. 

తేనె: తేనె కూడా మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇదొక నేచురల్ మాయిశ్చరైజర్. ఇది మన చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా.. కాంతివంతంగా కూడా చేస్తుంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు ముఖానికి తేనెను అప్లైచేసి 10-15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇధి మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేస్తుంది. 
 

రోజ్ వాటర్: రోజ్ వాటర్ ను వాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే దీన్ని ఎప్పుడు వాడితే మంచి ఫలితాలు వస్తాయన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. మీకు తెలుసా? రోజ్ వాటర్  ఒక గొప్ప నేచురల్ టోనర్. ఇది మన చర్మాన్ని శుభ్రపరిచి తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. దీన్ని రాత్రిపూట ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా, రిఫ్రెష్ గా అవుతుంది. 

బాదం నూనె: బాదం నూనె కూడా ముఖాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బాదం నూనెలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మన చర్మానికి లోతుగా పోషణను అందిస్తుంది. అలాగే చర్మాన్ని సాఫ్ట్ గా చేస్తుంది. బాదం నూనెను రాత్రిపూట ముఖానికి పెట్టి కాసేపు మసాజ్ చేయాలి. 

వేప నూనె: వేప నూనె కూడా చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వేపనూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ నూనెను ఉపయోగించి మనం ముఖంపై మొటిమలను, ఇన్ఫెక్షన్లను సులువుగా తగ్గించుకోవచ్చు. దీన్ని రాత్రిపూట దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖ చర్మం ఫ్రెష్ గా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. 
 


జోజోబా ఆయిల్: ఈ నూనె కూడా చర్మానికి మంచి మేలు చేస్తుంది. ఇది మన చర్మాన్ని లోతుగా తేమగాఉంచుతుంది. అలాగే చర్మం తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఈ నూనె ముఖానికి పెట్టడం వల్ల చర్మం సాఫ్ట్ గా అవుతుంది. 

చామంతి టీ:  చామంతి టీ కూడా ముఖానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల చామంతి టీ తీసుకుని అందులో కాస్త నిమ్మరసం, ఒక టీస్పూన్ శెనగపిండిని వేసి బాగా కలపండి. దీన్నిరాత్రిపూట ముఖానికి అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ సున్నితమైన చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా చేస్తుంది.

click me!