పెయిన్ కిల్లర్ వేసుకోకుండా.. కడుపు నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?

First Published | Nov 5, 2024, 1:35 PM IST

ఆడవాళ్లకు ప్రతి నెలా పీరియడ్స్ రావడం ఒక సహజ ప్రక్రియ. కానీ కొంతమందికి ఈ నెలసరి రోజులు చాలా కష్టంగా గడుస్తాయి. భరించలేని కడుపు నొప్పి, కాళ్లు, చేతులు లాగడం, తిమ్మిరి వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. 

ఆడవాళ్లకు ప్రతి నెలా పీరియడ్స్ వస్తుంటాయి. ఇది చాలా సహజం. అయితే ఈ రోజుల్లో కొంతమందికి ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమందికి మాత్రం ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా భరించలేని పొత్తికడుపు నొప్పి, వెన్ను నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు కుదురుగా ఉండనీయవు.

ఈ నొప్పిని తగ్గించుకోవడానికి చాలా మంది పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వాడుతుంటారు. కానీ వీటిని తరచుగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయినా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకోకున్నా పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవచ్చు. అదెలాగంటే? 

పీరియడ్ నొప్పి నివారణ చిట్కాలు

పీరియడ్స్ సమయంలో చాలా మందికి భరించలేని పొత్తికడుపు నొప్పి వస్తుంటుంది. అయితే కొంతమంది ఈ నొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ను ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే పీరియడ్స్ టైంలో మందులను ఎక్కువగా తీసుకోకూడదు. అందుకే పీరియడ్స్ నొప్పి తగ్గడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కుంకుమపువ్వు, ఎండుద్రాక్ష

పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవడానికి ఎండుద్రాక్ష, కుంకుమ పువ్వు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం పీరియడ్స్ రావడానికి ఒక వారం ముందే కుంకుమపువ్వును, ఎండుద్రాక్షలను నీళ్లలో నానబెట్టి ప్రతిరోజూ తాగాలి. ఈ వాటర్ లోని ఎండుద్రాక్ష మీ శరీరంలోని ఐరన్ లోపాన్ని పోగొడుతుంది. అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, తిమ్మిరి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. 
 


periods

మొలకెత్తిన గింజలు 

మీకు తెలుసా? కొన్ని కొన్నిసార్లు నెలసరి నొప్పి రావడానికి శరీరంలో పోషకాలు లోపించడం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ప్రతిరోజూ మొలకెత్తిన, పండిన బీన్స్ ను  రోజువారి ఆహారంలో చేర్చుకుంటో పోషకాల లోపం తీరుతుంది. దీంతో మీకు నెలసరి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

periods

ఆరోగ్యకరమైన పీరియడ్స్ కోసం ఏం తినాలి? 

పీరియడ్స్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకూడదన్నా.. మీరు ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి. అంటే సీజనల్ రూట్ కూరగాయలను ప్రతిరోజూ తినాలి. అంటే చిలగడదుంప, క్యారెట్ వంటి వంటి కూరగాయల్లో పాలిఫెనాల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నెలసరి నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఇందుకోసం వీటిని వారానికి రెండు రోజులు తినాలి. 


తేనె, పచ్చి ఉల్లిపాయల 

పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి పచ్చి ఉల్లిపాయ, తేనె కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ రెండు మీ శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచి గర్భాశయంలోని కండరాలను సడలిస్తాయి. దీంతో నొప్పి చాలా వరకు తగ్గుతుంది. 

ఇందుకోసం పచ్చి ఉల్లిపాయలోని తెల్లని భాగాన్ని తీసుకుని దాని రసాన్ని వేరుచేయాలి. దీన్ని ఒక టీస్పూన్ తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె వేసి కలపండి. పీరియడ్స్ టైంలో తేలికపాటి గోరువెచ్చని నీళ్లతో రోజుకు 3-4 సార్లు దీన్ని తాగితే కడుపు నొప్పి నుంచి చాలా ఉపశమనం పొందుతారు. 

Latest Videos

click me!