పాత చీరలతో కొత్త సొగసులు..!

First Published | Jul 15, 2021, 2:27 PM IST

కొన్ని డిజైన్లు పాతగా అయిపోయాయని పక్కన పెడతాం. కొన్ని ఓల్డ్ ఫ్యాషన్ అని.. కొన్ని కట్టి కట్టి విసిగిపోయామంటూ పక్కన పెట్టేస్తారు. 

మన దేశంలో దాదాపు ప్రతి ఒక్కరి వార్డ్ రోబ్స్ లో చీరలు ఉంటాయి. అసలు చీర అనేది లేని ఇళ్లు ఉండదేమో. మన అమ్మమ్మలు, అమ్మలు అందరూ చీరలు కట్టుకునేవారే.
undefined
ఈ తరం అమ్మాయిలు సైతం... రోజు కట్టకపోయినా.. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కచ్చితంగా చీరలే కడుతున్నారు. ట్రెడిషనల్ వేర్ అనగానే మనకు ముందుగా చీరలే గుర్తుకువస్తాయి.
undefined

Latest Videos


ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. దాదాపు అందరి ఇళ్లల్లో పాత చీరలు ఉండనే ఉంటాయి. కొన్ని డిజైన్లు పాతగా అయిపోయాయని పక్కన పెడతాం. కొన్ని ఓల్డ్ ఫ్యాషన్ అని.. కొన్ని కట్టి కట్టి విసిగిపోయామంటూ పక్కన పెట్టేస్తారు. అయితే.. ఇప్పుడు ఆ పాత చీరలతో కొత్తగా సొగసులు అద్దవచ్చని ఫ్యాషన్ ప్రియులు చెబుతున్నారు.
undefined
మీ దగ్గర పాత చీర ఏదైనా ఉన్నా.. లేదా మీకు నచ్చిన చీర చిరిగిందని పక్కన పెట్టినట్లయితే... దానిని అందమైన స్కార్ఫ్ గా మార్చుకోవచ్చు. మీకు తెలిసే ఉంటుంది. ఈ రోజుల్లో ఎలాంటి డ్రెస్ మీదకైనా స్కార్ఫ్ ని జత చేయవచ్చు. దాని వల్ల డ్రెస్ అందం మరింత పెరుగుతుంది.
undefined
ఈ రోజుల్లో చాలా రకాల ఆభరణాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిలో క్లాత్ యాక్సెసరీలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు మీ పాత చీరలతో నెక్లెస్ లు, కంకణాలు లాంటి విభిన్న జ్యువెలరీ తయారు చేసుకోవచ్చు. లేదా ఏదైనా డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చు.
undefined
క్లాత్ సూట్ అయితే.. మీ చీరతో ఓవర్ కోట్ కుట్టుకోవచ్చు. అలా ఓవర్ కోట్ కుట్టుకొని.. దానిని ఇతర డ్రెస్ ల మీద వేసుకున్నా.. బాగుంటుంది. పాత చీరను వాడినట్లూ ఉంటుంది.. కొత్త మోడల్ డ్రెస్ వేసుకున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది.
undefined
ఒకప్పుడు చీరకట్టాలంటే అది ఆరుగజాలు ఉండాలి అనేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. జీన్స్ మీద కూడా చీరకట్టేస్తున్నారు. దానికి ఆరు గజాలు అవసరం లేదు. కాబట్టి.. మీ డ్యామేజ్ చీరను.. సింగిల్ పీస్ చీరగా మార్చి.. మోడ్రన్ గా మార్చుకోవచ్చు. దీని వల్ల మీరు పాత చీరను మార్చుకున్నామనే తృప్తి.. ఫ్యాషన్ ఫాలో అయ్యామనే సంతృప్తి దక్కుతుంది.
undefined
click me!