ఈ నూనె వాడితే.. జుట్టురాలడం అనేది జరగదు..!

First Published Jul 13, 2021, 12:40 PM IST

వాటిల్లో బృంగరాజ్ కూడా  ఒకటి. ఈ బృంగరాజ్ ఆయిల్ వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. అంతేకాదు.. జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. అందుకే.. దీనిని ఇంగ్లీష్ లో కింగ్ ఆఫ్ హెయిర్ అని కూడా అంటూ ఉంటారు.

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు ఈరోజుల్లో బాగా పెరిగిపోయారు. మన లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారం ఇలా.. కారణం ఏదైనా జుట్టు విపరీతంగా రాలిపోతోంది. అయితే.. దీనికి ఆయుర్వేదంతో పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
ఆయుర్వేదంలో మనకు తెలియని సహజమైన మెడిసిన్స్ చాలా ఉంటాయి. ఇవి వాడటం వల్ల.. మన శరీరానికీ, జుట్టుకీ, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
undefined
వాటిల్లో బృంగరాజ్ కూడా ఒకటి. ఈ బృంగరాజ్ ఆయిల్ వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. అంతేకాదు.. జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. అందుకే.. దీనిని ఇంగ్లీష్ లో కింగ్ ఆఫ్ హెయిర్ అని కూడా అంటూ ఉంటారు.
undefined
బ్రింగరాజ్ ఆయిల్ ని బ్రింగరాజ్ మొక్క నుంచి.. సహజ కొబ్బరి నూనెల మిశ్రమంతో తయారు చేస్తారు. కాబట్టి.. ఈ నూనెను జుట్టుకు రాయడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
undefined
ఆయుర్వేదం ప్రకారం, ఈ నూనె తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని నమ్ముతారు. రక్త ప్రసరణ బాగా జరిగినప్పుడు.. జుట్టు బలంగా పెరగడానికి సహకరిస్తుంది. ఈ బృంగరాజ్ మొక్క సారం జుట్టు పెరగదలకు సహాయం చేస్తుందని చాలా పరిశోధనలో తేలింది.
undefined
చుండ్రు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు విపరీతంగా పెరిగిపోతుంది. అయితే... ఈ బృంగరాజ్ ఆయిల్ వాడటం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. బృంగరాజ్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి.. చుండ్రు సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది.
undefined
ప్రతిరోజూ.. కొద్దిగా ఈ నూనెను కుదుళ్లకు రాసి.. నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.
undefined
అంతేకాదు.. ఈ ఆయిల్ తో కుదుళ్లకు మసాజ్ చేయడం వల్ల జుట్టురాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. కాబట్టి.. దాని వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
undefined
ఆ నూనె తరచూ వాడటం వల్ల తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.
undefined
click me!