అన్నం వండటానికి ముందు బియ్యాన్ని బాగా కడుగుతారు. ఈ కడిగిన వాటర్ ను బయట చల్లేస్తారు. కానీ ఈ వాటర్ మన చర్మానికే కాదు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అవును ఈ బియ్యం వాటర్ లో ఎన్నో లక్షణాలు ఉంటాయట. ఈ బియ్యం బాటర్ మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ వాటర్ ను ఉపయోగించి ఎన్నో చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ వాటర్ లో ఉండే ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.
rice water
ఆయుర్వేదంలో.. బియ్యం నీటిని ఎన్నో ఏండ్లుగా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ వాటర్ సహాయంతో పైసా ఖర్జు లేకుండా యూటీఐ, వైట్ డిశ్చార్జ్ సమస్యను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
బియ్యం నీటిని ఎలా తయారు చేయాలి?
దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకోండి. ఈ బియ్యంలో 60-80 మిల్లీలీటర్ల నీటిని పోయండి. దీన్ని 2 నుంచి 6 గంటల వరకు అలాగే ఉంచండి. ఇంకేముందు ఈ నీటిని తాగొచ్చు. ఈ వాటర్ ను ఒకేసారి తాగొచ్చు. లేదా రోజంతా కొన్ని కొన్ని తాగొచ్చు. ఎలా తాగినా ఈ వాటర్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఈ వాటర్ ను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
rice water
బియ్యం నీటి ప్రయోజనాలు
1. రైస్ వాటర్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇది మన ఆరోగ్యానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది.
2. చాలా మంది ఆడవారు తెల్లబట్ట తో బాధపడుతుంటారు. అయితే ఈ వాటర్ ను తాగితే ఈ సమస్య పూర్తిగా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
rice water
3. రైస్ వాటర్ లో చలువ చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ ను తాగితే విరేచనాలు, మూత్రంలో చికాకు, రక్తస్రావం రుగ్మత, హెవీ పీరియడ్స్ వంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
4. ఈ వాటర్ తో తాగడమే కాుద.. ముఖానికి కూడా కూడా ఉపయోగించొచ్చు. దీన్ని ముఖానికి రాయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
5. బియ్యం నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తాయి. అలాగే పిగ్మెంటేషన్ ను నివారిస్తాయి. వృద్ధాప్య ప్రభావాలను కూడా తగ్గిస్తాయి.