పీరియడ్స్ లో మహిళలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం ఇదే..!

First Published Nov 24, 2021, 3:26 PM IST

ఈ చిరాకులు తగ్గాలంటే... అందుకోసం మనం తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. పీరియడ్స్ రోజుల్లో ఈ ఆహారాలు తినడం వల్ల మీరు కొంచెం రిలాక్స్‌గా ఉంటారు.

periods

పీరియడ్స్ దగ్గరకు వస్తే చాలు, చాలా మంది మహిళల్లో ఆందోళన మొదలౌతుంది. రుతుస్రావం  సమయంలో  కడుపు నొప్పి, వేదన, తిమ్మిరి, మలబద్ధకం, మానసిక కల్లోలం, తలనొప్పి, పాదాల నొప్పి వంటి వివిధ చికాకులు ఉంటాయి. ఈ చిరాకులు తగ్గాలంటే... అందుకోసం మనం తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. పీరియడ్స్ రోజుల్లో ఈ ఆహారాలు తినడం వల్ల మీరు కొంచెం రిలాక్స్‌గా ఉంటారు.

నీళ్లు తాగండి
ఋతుస్రావం సమయంలో ఇతర రోజుల కంటే చాలా తరచుగా మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు తాగడం వల్ల పీరియడ్స్‌లో తలనొప్పి , టెన్షన్స్ తగ్గుతాయి. కాబట్టి.. పీరియడ్స్ లో వాటర్ ఎక్కువగా తాగాలి.
 

అరటి పండు..

పీరియడ్స్ సమయంలో.. కచ్చితంగా అరటి పండు తీసుకోవాలి. ఈ పీరియడ్స్  సమయంలో చాలా మంది అతిసార సమస్యతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి.. కచ్చితంగా అరటి పండు తినాలి. అరటిపండులోని మెగ్నీషియం, పొటాషియం , ఫైబర్ మీ ప్రేగు కదలికను చెక్కుచెదరకుండా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇది మూడ్ రిలాక్సర్ కూడా. మంచి కండరాల రిలాక్సర్‌గా ఉండటం వల్ల మెగ్నీషియం కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. కొంతమందికి బహిష్టు సమయంలో ఆకలి వేస్తుంది. ఆ ఆకలిని తగ్గించే పనిని అరటిపండు చేస్తుంది.
 

అల్లం..

అల్లం తో చేసిన  కషాయాన్ని.. పీరియడ్స్ సమయంలో తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల .. మోకాలి నొప్పులు, కడుపులో నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నారింజ..
నారింజలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది . ఆందోళన,నిరాశ నుండి ఉపశమనం లభిస్తుంది. నిమ్మ, దానిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు నారింజ మాదిరిగానే మానసిక స్థితిని సరిచేస్తాయి. వీటిలో ఏవైనా తీసుకోవచ్చు.
 

చేప..
 చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గర్భాశయాన్ని సడలించి నొప్పిని తగ్గిస్తుంది. అదనంగా, ఇది ప్రోటీన్ ,విటమిన్ బిని కలిగి ఉంటుంది, ఇది ఆ సమయంలో శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

egg

కోడి గుడ్డు..
కోడి గుడ్డులో ఐరన్, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు  ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే బలహీనతను తగ్గిస్తుంది.

డార్క్ చాక్లెట్ 
డార్క్ చాక్లెట్ మూడ్ బూస్టర్‌గా ప్రసిద్ధి చెందింది. ఆర్గానిక్ డార్క్ చాక్లెట్ పీరియడ్స్ సమయంలో మిమ్మల్ని మరింత సౌకర్యవంతంగా ఉంచుతుంది. కానీ ఇతర స్వీట్లు ,ప్రాసెస్ చేసిన మిఠాయిలకు దూరంగా ఉండండి. ఎందుకంటే కృత్రిమ చక్కెరతో కూడిన చాక్లెట్లు ఎప్పుడూ మంచివి కావు.

click me!