ఆక్సిజన్ ఫేషియల్: మీ చర్మం, మీ శరీరంలోని అన్ని ఇతర అవయవాల్లాగే, ఆక్సిజన్ లేకుండా మనుగడ సాగించదు. అది తగినంతగా ఉన్నప్పుడు వృద్ధి చెందుతుంది. డాక్టర్ మల్పాని ప్రకారం, ఆక్సిజన్ ఫేషియల్ సమయంలో, సౌందర్య నిపుణుడు చర్మాన్ని ఆక్సిజన్ చేయడానికి ఉత్పత్తులు , యంత్రాలను ఉపయోగిస్తాడు. దీని వల్ల చర్మం మృదువుగా, స్పష్టంగా, కాంతివంతంగా మారుతుంది. ఈ రకమైన ఫేషియల్ చాలా సున్నితంగా ఉంటుంది. ఈ ఫేషియల్ చేయించుకుంటే.. ఎవరైనా అందంగా మెరిసిపోవాల్సిందే.