పెళ్లైన స్త్రీలు నల్లపూసలు ఎందుకు ధరిస్తారు..?

First Published Nov 24, 2021, 1:10 PM IST

తన జీవితాంతం తోడుగా ఉండాలి అనే భావనతో.. పెళ్లిలో వరుడు.. వధువు మెడలో.. ఈ మంగళసూత్రం, నల్లపూసలు కడతారట. అందుకే.. పెళ్లి అనేది.. ఈ మంగళసూత్రంతోనే ముడిపడి ఉంటుంది.

Mangalsutr

పెళ్లైన మహిళలు.. కచ్చితంగా మెడలో మంగళసూత్రం కానీ.. నల్ల పూసలు గానీ ధరిస్తారు. ఇది మన సంప్రదాయం. భారతీయ సంప్రదాయ ప్రకారం.. కొన్ని దశబ్దాల కాలంగా.. వీటిని ధరిస్తూ వస్తున్నారు. అయితే..  అసలు మంగళ సూత్రం, నల్లపూసలు ఎందుకు వేసుకుంటారు. అలా వేసుకోవడం వెనక పరామర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Mangalsutr

తమకు పెళ్లి అయ్యిందని.. తమ భర్త గుర్తుగా మహిళలు.. మెడలో నల్లపూసలు ధరిస్తూ ఉంటారు. వీటిని స్వయంగా భర్తే.. భార్య మెడలో కడతారు. భర్త తమతో జీవితాంతం ఉండాలనే అభిప్రాయంతో వారు ఇలా వేసుకుంటూ ఉంటారట.
 

Mangalsutr

మంగళసూత్రం అనే పదం.. రెండు పదాలుగా చెబుతారు. ఒకటి మంగళ. మరోటి సూత్రం. మంగళం అంటే.. మంచి అని అర్థం. దీనిని మెడలో ఉంచుకుంటూ మంచి జరుగుతుందని అర్థం. ఇక సూత్రం అంటే.. దారం అని అర్థమట. 
 

తన జీవితాంతం తోడుగా ఉండాలి అనే భావనతో.. పెళ్లిలో వరుడు.. వధువు మెడలో.. ఈ మంగళసూత్రం, నల్లపూసలు కడతారట. అందుకే.. పెళ్లి అనేది.. ఈ మంగళసూత్రంతోనే ముడిపడి ఉంటుంది.
 

ఇక ఈ రోజుల్లో నల్లపూసలను.. బంగారం లాకెట్ తో జత చేసి వేసుకుంటున్నారు. అందులో నల్లపూసలు.. దంపతులపై చెడు ప్రభావం పడకుండా ఉండేందుకు.. ఏ దుష్ట శక్తి వారిని ఏమీ చేయకూడదనే ఉద్దేశంతో.. ఇలా నల్లపూసలు పెళ్లిలో కట్టిస్తారట.
 

మహిళలు.. మంగళ సూత్రం ధరించడం వల్ల.. భర్త క్షేమంగా ఉంటాడని.. ఎలాంటి ప్రమాదాల బారినపడకుండా ఉంటాడని విశ్వాసమట. అందుకే.. పెళ్లైన మహిళలు కచ్చితంగా మంగళసూత్రం ధరించాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఇక దక్షిణాదిన స్త్రీలు.. నల్లపూసలు కాకున్నా..  సూత్రాలతో పసుపు తాడు ధరిస్తారు. కానీ.. దానికి కూడా కనీసం రెండు , మూడు నల్ల పూసలు ఉండేలా చూసుకుంటారు. ఇక ఉత్తరాది స్త్రీలు మాత్రం కేవలం.. నల్ల పూసలు మాత్రమే ధరిస్తారు. వాటికి బంగారం, డైమండ్ లాకెట్స్ జత చేస్తారు.

ఇక ఆయుర్వేదం ప్రకారం... మంగళసూత్రం ధరించడం వల్ల.. గుండె పనితీరు ఇంప్రూవ్ అవుతుందట. అంతేకాకుండా.. హృదయం కేవలం పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉండటం.. పాజిటివ్ ని స్వీకరించడం లాంటివి జరుగుతాయట. అందుకే.. మంగళసూత్రం ధరించాలని చెబుతున్నారు.

ఈ మంగళసూత్రం ధరించడం వల్ల... మానసికంగా.. ఎమోషనల్ గా.. శాంతి లభిస్తుందట. అంతేకాకుండా.. భార్య భర్తల మధ్య బంధం కూడా బలపడుతుందట.

click me!