పీరియడ్స్ టైం లో వీటిని తింటే కడుపు నొప్పి ఎక్కువవుతుంది జాగ్రత్త..

First Published Jan 10, 2024, 3:09 PM IST

పీరియడ్స్ టైంలో కొంతమందికి భరించలేని నొప్పి వస్తుంది. అయితే ఈసమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలను తింటే కడుపు నొప్పి మరింత పెరుగుతుంది. 
 

పీరియడ్స్ సమయంలో ఐదు రోజులు ప్రతి మహిళకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పీరియడ్స్ వల్ల కడుపు, నడుము నొప్పితో పాటుగా మూడ్ స్వింగ్స్ సమస్య కూడా ఉంటుంది.ఇలాంటి పరిస్థితిలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిజానికి కొన్ని ఆహారాలను తినడం వల్ల పీరియడ్స్ నొప్పితో పాటు బ్లీడింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

periods

ఎక్కువ ఉప్పు 

పీరియడ్స్ సమయంలో ఆడవారు ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉప్పు పరిమాణం పెరిగితే శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. అలాగే ఇది కడుపులో వాపు, నొప్పి సమస్యను మరింత పెంచుతుంది. అందుకే పీరియడ్స్ సమయంలో చిప్స్ లేదా స్నాక్స్ వంటి స్నాక్స్ లను తినకూడదు. లేదంటే నొప్పి ఎక్కువ అవుతుంది. 
 

Image: Getty

చక్కెర

పీరియడ్స్ సమయంలో ఆడవారు చాక్లెట్లు, కుకీలు వంటి తీపి పదార్థాలను తినడానికి ఇష్టపడతారు. కానీ తీపి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల పీరియడ్స్ రోజులు మరింత కష్టంగా ఉంటాయి. నిజానికి స్వీట్స్  ను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగి కడుపునొప్పితో పాటు మానసిక ఒత్తిడి, అలసట సమస్యలు కూడా పెరుగుతాయి.
 

Image: Getty Images

జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్

జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పీరియడ్స్ సమయంలో మీరు ఇలాంటి వాటిని తినకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే వీటిని తినడం వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరిగి, దాని వల్ల గర్భాశయంలో వాపు వస్తుంది. ఇది పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది.
 

periods pain

టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం

పీరియడ్స్ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆడవారు ఎక్కువగా టీ-కాఫీ లు తాగుతారు. నిజమేంటంటే టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల కడుపులో గ్యాస్, తిమ్మిరి సమస్య పెరిగి పీరియడ్స్ పెయిన్ పెరుగుతుంది. అందుకే పీరియడ్స్ సమయంలో టీ, కాఫీలను ఎక్కువగా తాగకండి. 

సిట్రస్ పండ్లు

పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. ముఖ్యంగా సిట్రస్ పండ్లు. పీరియడ్స్ సమయంలో నారింజ, నిమ్మ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు మీ అసౌకర్యాన్ని పెంచుతాయి. నిజానికి ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ చెడిపోతుంది. అదే సమయంలో జీర్ణక్రియలో అవాంతరాల వల్ల పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి సమస్య పెరుగుతుంది.

click me!