షాకిస్తున్న బంగారం ధరలు.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయిగా..!

First Published | Aug 1, 2024, 1:10 PM IST

వరసగా బంగారం తగ్గుతూ వచ్చాయి. దీంతో... శ్రావణ మాసం రాగానే బంగారం కొనాలని చాలా మంది ఆశపడ్డారు. 

బంగారం ధరలు ఎప్పుడూ పెరగడమే కానీ... తగ్గడం మనం ఎప్పుడూ చూడలేదు. తగ్గినా.. మహా అంటే తులం రూ.100 కు మించి తగ్గదు. కానీ.. పెరగడం మాత్రం ఆకాశాన్ని తాకేవి. ఊహించని విధంగా పది గ్రాముల ధర దాదాపు రూ.75 వేలు, రూ.80వేలకు చేరిపోయింది. ఇక సామాన్యులు బంగారం కొనడం కలే అనుకునే టైమ్ లో... కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో.. బంగారం సుంకం ధర తగ్గించడంతో... రేట్లు కూడా తగ్గుతాయి అని ప్రకటించారు. ఆ రోజు నుంచి బంగారం ధరలు పడిపోవడం మొదలయ్యాయి.  సామాన్యుల ఆశలు మళ్లీ చిగురించడం మొదలైంది.

వరసగా బంగారం తగ్గుతూ వచ్చాయి. దీంతో... శ్రావణ మాసం రాగానే బంగారం కొనాలని చాలా మంది ఆశపడ్డారు. ఎందుకంటే.. శ్రావణ మాసం మొదలైంది అంటే శుభకార్యాలు మొదలౌతాయి. బంగారం కొనకుండా.. ఏ శుభకార్యం పూర్తి కాదు. అందుకే.. అందరూ ఆ శ్రావణ మాసం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బంగారం ధరలు షాకివ్వడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా.. మళ్లీ  బంగారం ధరలు పెరగడం మొదలుపెట్టాయి. ఒక్క రోజులోనే పదిగ్రాముల బంగారం ధర రూ.820 పెరగడం గమనార్హం. 
 


gold rate

గురువారం అంటే... ఆగస్టు 1వ తేదీన బంగారం ధరలు పెరగడం గమనార్హం. మరి.. ఈ రోజు బంగారం ధర ఎంత పెరిగింది..? ఏ నగరంలో ఎంత ఉందో తెలుసుకుందాం...

gold rate

హైదరాబాద్ నగరంలో.. 
బంగారం ధరలు ఒక్కరోజులో రూ.820 పెరగడం గమనార్హం. తులం బంగారం రూ.820 పెరిగి.. 22 క్యారెట్ల పది గ్రాముల  బంగారం ధర 64, 010 కి చేరుకుంది. ఇక 24 గ్రాముల బంగారం ధర అయితే...  నిన్నటితో పోలిస్తే.. 890 పెరగడం గమనార్హం. నేడు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69, 830కి చేరుకుంది.

విజయవాడలో...
హైదరాబాద్ నగరంలో మాదిరిగానే విజయవాడలోనూ ధరలు ఉండటం విశేషం.   22 క్యారెట్ల పది గ్రాముల  బంగారం ధర 64, 010 కి చేరుకుంది.  నేడు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69, 830కి చేరుకుంది.
 

ఢిల్లీలో...
ఢిల్లీ మహానగరంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.64, 160గా ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.69,830కి చేరుకుంది.

చెన్నైలో..
చెన్నై మహానగరంలో... 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.64, 210 గా ఉండగా..  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.70,050 కి చేరుకుంది. 

బెంగళూరులో..
ఇక.. బెంగళూరు నగరంలో.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.64, 010గా ఉండగా... 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.69, 830కి చేరడం విశేషం. 

Latest Videos

click me!