మీ పిల్లల యూనిఫాంలను ఎలా ఉతికితే తెల్లగా అవుతాయో తెలుసా?

First Published Sep 24, 2024, 4:39 PM IST

చిన్న పిల్లల యూనిఫాం లు ఎలా మురికిగా మారిపోతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీటికి అంటిన మరకలను పోగొట్టడం మాత్రం తల్లులకు పెద్ద టాస్క్ లాగే ఉంటుంది.అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం ఎంతటి మురికి యూనిఫాం అయినా తలతల తెల్లగా మెరిసిపోవాల్సిందే.
 

స్కూల్ యూనిఫాం లు ఎక్కువగా తెలుపు, క్రీమ్ కలర్ లోనే ఉంటాయి. కానీ పిల్లలు కుదురుగా ఉండరు. ఈ యూనిఫాం లకు పెన్ను, పెన్సిల్ గీతలు, కూరలు, ఫుడ్ మరకలు, చాక్లెట్ల మరకలు, బురద మరకలు  ఇలా ఎన్నింటినో అంటించుకుంటారు. 

దీనివల్ల పిల్లల యూనిఫాం లు మురికిగా మారుతాయి. వీటిని ఉతికి తెల్లగా చేయడం తల్లులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. కొన్ని కొన్ని సార్లు వీటిని చేతులు నొప్పి పుట్టంగ ఉతికినా మరకలు పోవు. తెల్లగా కావు. సబ్బుతో తరచుగా ఉతకడం వల్ల తెల్ల దుస్తులు కాస్త మబ్బుగా మారుతాయి. అందుకే స్కూల్ యూనిఫాం ల కాలర్ మరకలు, బురద మరకలు, సిరా మరకలు, ఆహార మరకలు వంటి మురికి మరకలను ఈజీగా ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


స్పాట్ ట్రీట్మెంట్

స్పాట్ ట్రీట్మెంట్ తో కూడా స్కూల్ యూనిఫాం లకు అంటుకున్న మురికిని సులువుగా పోగొట్టిచొచ్చు. ఇందుకోసం యూనిఫాంపై పెన్ను గీతలు, ఆహారం లేదా బురద వంటి మరకలను పోగొట్టడానికి స్పాట్ ట్రీట్మెంట్  చేయండి. అంటే ఆ మరకలను పోగొట్టడానికి వాటికి కొద్దిగా సబ్బు పెట్టి బాగా రుద్ది పిండండి. ఆ తర్వాత మళ్లీ యూనిఫాం ను ఉతికేయండి. 

నిమ్మకాయ

నిమ్మకాయతో ఎన్నింటినో క్లీన్ చేయొచ్చు. దీనిలో బ్లీచింగ్ ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయతో కూడా మొండి మరకలను సులువుగా పోగొట్టొచ్చు. ఇందుకోసం నిమ్మకాయను రెండు భాగాలుగా కట్ చేయండి. దీన్ని స్కూల్ యూనిఫాం కు అంటిన మరకలకు బాగా రుద్దండి. ఆ తర్వాత యూనిఫాం ను సబ్బు నీటిలో నానబెట్టి బ్రష్ తో రుద్దితే మరకలు సులువుగా పోతాయి. 
 

వెనిగర్

వెనిగర్ తో కూడా మీరు మొండిమరకలను సులువుగా పోగొట్టొచ్చు. మీకు తెలుసా? వెనిగర్ లో బ్లీచింగ్ ఏజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. యూనిఫాం కు అంటిని మరకను పోగొట్టడానికి 1/2 కప్పు వెనిగర్ ను నీళ్లలో వేసి కలపండి. దీంట్లో స్కూల్ యూనిఫాం ను గంట పాటు నానబెట్టండి. తర్వాత బ్రష్ తో స్క్రబ్ చేస్తే మరకలు ఒక్కటి లేకుండా పోతాయి. 

బేకింగ్ పౌడర్

బేకింగ్ పౌడర్ కూడా దుస్తులకు అంటిన మరకలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం బేకింగ్ పౌడర్ లో కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ లు యూనిఫాం కు ఎక్కడెక్కడైతే మరకలు అంటాయో అక్కడ రుద్దండి. తర్వాత వాటిని క్లీన్ చేస్తే మరకలు పూర్తిగా పోతాయి. ఇకపోతే కొత్త యూనిఫాంను పిల్లలకు అలాగే వేయకుండా దానికి వాష్ చేసి వేయడం మంచిది. 
 

అయితే పిల్లల స్కూల్ యూనిఫాంలను ఉతికేటప్పుడు వాటిని వేరే దుస్తులతో అస్సలు నానబెట్టకూడదు. అలాగే ఇతరుల బట్టలతో పాటుగా పిల్లల బట్టలను వాషింగ్ మెషిన్ లో వేయకూడదు. ఎందుకంటే పెద్దల దుస్తులకు ఉన్న క్రిములు పిల్లల బట్టలకు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లల దుస్తులు విడిగా ఉతకడమే మంచిది. 

బాగా ఎండబెట్టాలి

పిల్లల స్కూలు యూనిఫాం సాక్స్ లను ఆరిన తర్వాత మడతపెట్టే ముందు లేదా ఉపయోగించే ముందు వాటిలో కొద్దిగా కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కొద్దిపాటి తేమ కూడా సూక్ష్మక్రిములను కలిగి ఉంటుంది. అందుకే వాటిని ఎండలో కొద్దిసేపు బాగా ఆరబెట్టాలి. 
 

click me!