చర్మ సౌందర్యానికి ఆయుర్వేద టిప్స్..!

First Published | Jun 10, 2022, 3:00 PM IST

బయట ఎండ కారణంగా.. పదేపదే చెమటలు చిందిస్తూ ఉంటాం. అంతేకాకుండా.. మన చర్మం నుంచి ఆయిల్ బయటకు వచ్చి.. ముఖం జిడ్డుగా మారుతుంది. 

చాలా మంది చలికాలంలో మాత్రమే చర్మం పాడౌతుందని.. ఆ సమయంలోనే కేర్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ..  చలికాలంలో మాత్రమే కాదు.. వేసవికాలంలోనూ చర్మ సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే..  చర్మం డీ హైడ్రేట్ అవ్వడం.. దురద రావడం, పొడిబారడం లాంటి సమస్యలు ఎదురౌతాయట.

బయట ఎండ కారణంగా.. పదేపదే చెమటలు చిందిస్తూ ఉంటాం. అంతేకాకుండా.. మన చర్మం నుంచి ఆయిల్ బయటకు వచ్చి.. ముఖం జిడ్డుగా మారుతుంది.

Latest Videos


మరి ఈ సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే.. ఆయుర్వేదం ప్రకారం కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాల్సిందేనట. మరి అవేంటో ఓసారి చూద్దామా..


మిమ్మల్ని, మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి, తగినంత మొత్తంలో నీరు త్రాగడం చాలా ముఖ్యం.  కేవలం నీరు మాత్రమే కాకుండా.. కొబ్బరి నీరు, చెరుకు రసం, నిమ్మకాయ నీళ్లు, మంచిగ లాంటివి తీసుకోవాలట. ఇక కూల్ డ్రింక్స్ లాంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. 

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి రోజ్ వాటర్, కలబంద జెల్ ని రాయాలి. ఇలా రాయడం వల్ల.. చర్మం హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటు..బయట వేడిని తట్టుకోగలుగుతుంది.
 

పొడి చర్మంతో ఇబ్బందిపడేవారికి ఫేస్ మాస్క..

ఒక టీస్పూన్ శెనగపిండి , 1 చిటికెడు పసుపు, 1 టీస్పూన్ తేనె తీసుకుని, అందులో అవసరమైన పరిమాణంలో పాలను కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని మీ ముఖంపై 25 నిమిషాలు అప్లై చేసి, ఆపై తేలికపాటి వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

 జిడ్డు, మొటిమలు, సున్నితమైన చర్మం కోసం ఫేస్ మాస్క్

1 టేబుల్ స్పూన్ గంధం, అర టీస్పూన్ ములేతి పొడి, 1/4 చెంచా మోరింగ పొడి, అందులో అవసరమైన పరిమాణంలో రోజ్ వాటర్ కలపండి. ఆ తర్వాత ముఖానికి పట్టించి 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

సాధారణ/మృదువైన చర్మం కోసం ఫేస్ మాస్క్..

1/4 కప్పు పాలను తీసుకుని, అందులో చిటికెడు పసుపు, అర టీస్పూన్ బియ్యం పిండితో ఒక టీస్పూన్ తేనె కలపండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.

చర్మ సమస్యలను నివారించడానికి వేసవిలో కారం, అధిక పులుపు, పులియబెట్టిన, డీప్ ఫ్రైడ్ , నాన్ వెజ్ ఫుడ్ మానేయండి. ఆరోగ్యకరమైన చర్మానికి మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. ఈ విషయాలు గుర్తించుకుంటే.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

click me!