ఎద సంపదను పెంచుకోవాలా.. ఈ వ్యాయామాలు బెస్ట్..!

First Published Oct 23, 2021, 12:20 PM IST

మీకు వ్యాయామం చేసే అలవాటు ఉంటే.. బ్యాక్, షోల్డర్ మజిల్స్ పై ఫోకస్ పెట్టాలట. ఈ వ్యాయామం చేయడం వల్ల చెస్ట్ మజిల్స్ యాక్టివ్ అయ్యి.. ఎద సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. 


ఎద సంపద పెంచుకోవాలని చాలా మంది అమ్మాయిలు తాపత్రయ పడుతుంటారు. ఎద సంపద.. ఒత్తుగా.. సరైన ఆకృతిలో ఉంటే..  ఎలాంటి దుస్తులు వేసుకున్నా.. అందంగా కనపడతారనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. దీని కోసం కొందరు సర్జరీలు చేసుకున్నవారు కూడా ఉన్నారు.

అయితే.. ఎలాంటి సర్జరీలు లేకుండా.. కాస్త కష్టపడితే ఎద సంపదను సులభంగా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది కూడా కొన్ని వ్యాయామాలతో సాధ్యమౌతుందట. మరి అవేంటో తెలుసుకుందామా..

మీకు వ్యాయామం చేసే అలవాటు ఉంటే.. బ్యాక్, షోల్డర్ మజిల్స్ పై ఫోకస్ పెట్టాలట. ఈ వ్యాయామం చేయడం వల్ల చెస్ట్ మజిల్స్ యాక్టివ్ అయ్యి.. ఎద సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా.. సరైన ఆకృతిలోకి మారతాయట.

ఈ వ్యాయామాలు మనం వెయిట్స్ తోటి, బరువు ఎక్కువగా ఉన్న ఆహారం, వాటర్ బాటిల్స్ మోయడం లాంటివి చేయడం వల్ల కూడా.. బ్రెస్ట్ పెరిగే అవకాశం ఉంటుందట.

గోడకు ఎదురుగా నిలపడి.. మీ రెండు అరచేతులతో గోడను బలంగా నెట్టి ఉంచాలి. ఇప్పుడు అలా ఉంచి.. మీ కాళ్లను ముందుకు వెనకకు అనాలి. ఇలా రిపీట్ చేయడం వల్ల..కూడా మీరు అనుకున్న ఆకృతి, పరిమాణం పొందగలుగుతారు.

మీ రెండు చేతలను భుజాలకు సమానంగా చాపాలి. ఆ తర్వాత.. రెండు చేతులను క్లాక్ వైస్, యాంటీ క్లాస్ వైస్ సర్కిల్ రూపంలో తిపాలి. ఒక్కో చెయ్యి నిమిషం పాటు తిప్పాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల కూడా మీ ఎద సంపద పెరుగుతుంది.

దేవుడికి మనం నమస్కారం ఎలా చేస్తాం. అలా చేతులను చెస్ట్ కి సమీపంలో పెట్టాలి. దాదాపు 30 సెకన్లపాటు అలా ఉంచాలి. అయితే.. ఆ సమయంలో మీ మో చెయ్యి 90 డిగ్రీల వద్ద ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల కూడా మీరు అనుకున్నది సాధ్యమౌతుంది. రెండు మోచుతులు దగ్గర ఉండటం ముఖ్యం.

click me!