
చిన్న వయసులోనే ముఖంలో గ్లో తగ్గిపోతుందని, ముడతలు వచ్చేస్తున్నాయని బాధపడేవారు చాలా మంది ఉన్నారు. అంతేకాదు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుందని ఫీలయ్యే వారు కూడా చాలా మంది ఉన్నారు.ఈ రెండింటి సమస్యలకు కేవలం ఒకే ఒక్క డ్రింక్ తో చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా? ప్రతిరోజూ ఒకే ఒక్క డ్రింక్ రోజూ తాగడం వల్ల మీ అందం పెరగడమే కాదు, జుట్టు సమస్యలకు కూడా తగ్గించుకోవచ్చు. మరి, ఆ డ్రింక్ ఏంటో చూద్దామా...
ఇప్పటి వరకు చియా సీడ్స్ ని బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగించి ఉంటారు. కానీ, ఈ చియా సీడ్స్ మీ అందాన్ని పెంచడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడతాయి. చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, జింక్, రాగి వంటి పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి.ఈ చియా సీడ్స్ ని రాత్రిపూట నీటిలో నానపెట్టి, ఉదయాన్నే తీసుకుంటే చాలు.
జుట్టు పెరుగుదలను పెంచుతుంది: చియా విత్తనాలలో ప్రోటీన్ , ముఖ్యమైన అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి, ఇవి జుట్టు బలంగా మారడానికి, ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి.
జుట్టు పల్చబడటాన్ని తగ్గిస్తుంది: చియా విత్తనాలలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను దెబ్బతినకుండా కాపాడతాయి, ఇది జుట్టు పల్చబడటాన్ని తగ్గిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: చియా విత్తనాలలోని జింక్, రాగి జుట్టు పల్చబడటాన్ని నివారించడంలో, ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.
చర్మ హైడ్రేషన్: చియా విత్తనాలు నీటిలో వాటి బరువు కంటే 12 రెట్లు గ్రహించగలవు, ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ: చియా విత్తనాలలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది ముడతలు, పిగ్మెంటేషన్‌ను తగ్గించే యాంటీ-ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.
చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది: వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి, ఇవి చర్మ కాంతిని, స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
కేవలం చియా సీడ్స్ వాటరే కాదు.. పసుపు నీరు కూడా మీ అందాన్ని పెంచడంలో సహాయపడతాయి. మీరు గోరు వెచ్చని నీటిని తీసుకొని అందులో చిటికెడు పసుపు వేయాలి. ఈ రెండింటినీ బాగా కలిపి.. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే చాలు. ఇది ఆరోగ్యం, చర్మం, జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది, ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.
పసుపు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రును పూర్తిగా తొలగించడానికి హెల్ప్ అవుతుంది.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: ఈ పానీయం తలపై మంటను తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకు పసుపు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
మొటిమలు, బ్లాక్ హెడ్స్ ను తగ్గిస్తుంది: పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు, బ్లాక్ హెడ్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
చర్మ రంగును మెరుగుపరుస్తుంది: పసుపును క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మ రంగు మెరుగుపడుతుంది. ముఖంలో సహజ కాంతి పెరుగుతుంది. పసుపులోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి, ఇది వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది.