dandruff
చుండ్రు సమస్య చాలా మందికి ఉంటుంది. ఇదొక సర్వ సాధారణ సమస్యే అయినా.. దీనివల్ల వెంట్రుకలు బాగా రాలుతాయి. షాంపూను ఎక్కువగా ఉపయోగించడం, తలమీద చెమట ఎక్కువగా పట్టడం వల్ల నెత్తిమీద మురికి పేరుకుపోతుంది. చుండ్రు వస్తుంది. చుండ్రుకు చికిత్స చేయకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. జుట్టు కూడా విపరీతంగా రాలుతుంది.
చుండ్రును తగ్గించుకోవడానికి మీరు వారానికి రెండు మూడు సార్లు షాంపూతో తలస్నానం చేయాలి. అలాగే జుట్టును కడగడానికి గంట ముందు నూనెను ఖచ్చితంగా పెట్టాలి. అలాగే జుట్టు పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. అయితే మీరు బేకింగ్ సోడాను ఉపయోగించి కూడా ఈ చుండ్రును తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బేకింగ్ సోడా, తేనె, కొబ్బరి నూనె
బేకింగ్ సోడా, తేనె, కొబ్బరి నూనెను ఉపయోగించి కూడా మీరు చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఒక చెంచా బేకింగ్ సోడాలో ఒకటి నుంచి రెండు చెంచాల కొబ్బరినూనె, కొద్దిగా తేనె కలిపి పేస్టులా చేయండి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును కడగండి.
ఆలివ్ ఆయిల్, బేకింగ్ సోడా
మీరు చుండ్రును పోగొట్టడానికి ఆలివ్ ఆయిల్, బేకింగ్ సోడాను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఒక చెంచా బేకింగ్ సోడాలో ఒకటి నుంచి రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ ను కొద్దిగా తేనె కలిపి పేస్ట్ లా తయారుచేయండి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
గుడ్లు, బేకింగ్ సోడా
చుండ్రును పోగొట్టడానికి ఒక గుడ్డులో కొద్దిగా బేకింగ్ సోడాను, ఒకటిన్నర టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ ను వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి 20-25 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. వారానికి రెండుసార్లు ఈ పద్దతిని ఫాలో అయితే మంచి ఫలితాలు పొందుతారు.
బేకింగ్ సోడా, నిమ్మరసం
ఒక చెంచా బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం, కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లా తయారుచేయండి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేయండి. కనీసం 20 నిముషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఈ రెమెడీ చుండ్రును త్వరగా వదిలించుకోవడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. చుండ్రును పోగొట్టడంలో బేకింగ్ ప్రభావవంతంగా ఉన్నప్పటికీ.. దీన్ని మోతాదులోనే ఉపయోగించాలి. దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తే మీ జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది.
టీ ట్రీ ఆయిల్, బేకింగ్ సోడా
ఒక చెంచా బేకింగ్ సోడాలో రెండు చెంచాల టీ ట్రీ ఆయిల్, ఒక చెంచా తేనె కలిపి పేస్ట్ లా తయారుచేయండి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత తలస్నానం చేయండి.