ఆడవాళ్ల రోజువారి జీవితం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫీసుకు వెళ్లినా, ఇంటిదగ్గర ఉన్నా.. కుటుంబాన్ని చూసుకోవాల్సింది వీళ్లే. ఇటు ఇంటి పనులు, అటు ఆఫీసు పనులను చేసుకుంటూ బీజీ బిజీగా ఉంటారు. ఆఫీసులకు వెళ్లని వారికి పనులు తక్కువగా ఉంటాయంటే అదీ లేదు. ఏదేమైనా ఆడవారు కుటుంబాన్ని చక్కదిద్దడం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి, వారి బాగోగుల గురించి శ్రద్ధ తీసుకోవడంలోనే సమయాన్ని గడుపుతారు. చాలా మంది ఆడవారు తమకంటూ కొంత సమయాన్ని వెచ్చించాలని కూడా ఆలోచించరు. ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోరు. ఎంతసేపు కుటుంబం గురించే ఆలోచిస్తారు. ఇదే వారిని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. అసలు ఆడవాళ్లు ఎక్కువగా ఏ వ్యాధుల బారిన పడతారో తెలుసా?