skin care
ముఖ్యంగా ఆడవాళ్లైతే అందంగా కనిపించడంలో ఎక్కడా తగ్గరు. ఎంత ఖరీదైనా సరే బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. మేకప్ మాత్రమే మనల్ని అందంగా చేస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ మేకప్ లేకున్నా మీరు అందంగా కనిపిస్తారు. అదికూడా కొన్ని పనులను చేస్తే. అవుకు మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆరోగ్యకరమైన ఆహారం
హెల్తీ ఫుడ్ లో మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి కేవలం మన శరీరాన్ని మాత్రమే కాకుండా.. మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం మన శరీరం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చర్మంపై నేచురల్ గ్లో ని కూడా అందిస్తుంది.
తగినంత నిద్ర
నిద్ర ఎక్కువ పోయినా మంచిది కాదు. తక్కువ పోయినా మంచిది కాదు. ఇది మీ ముఖంపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరు సహజంగా అందంగా కనిపించాలంటే తగినంత నిద్రపోయేలా చూసుకోండి. దీనివల్ల మీరు మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు.
ప్రతిరోజూ వ్యాయామం
వ్యాయామం కేవలం మన శరీరాన్ని మాత్రమే ఫిట్ గా, హెల్తీగా ఉంచుతుంది అనుకుంటే పొరపాటే. మీరు ప్రతిరోజూ యోగా, వ్యాయామం, ధ్యానం, మార్నింగ్ వాక్ చేస్తే మీ శరీరం, మనస్సు, లోపలి నుంచి బయటినుంచి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. దీంతో మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. దీంతో మీరు త్వరగా వృద్ధాప్యంలోకి రారు.
పుష్కలంగా నీరు
మన శరీరానికి తగినంత నీరు చాలా అవసరం. నీరు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా శరీరానికి చురుకుదనాన్ని తీసుకొస్తుంది. అలాగే డ్రై స్కిన్, మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది.
శరీరం శుభ్రంగా
అందమైన, మెరిసే చర్మం పొందాలంటే మీరు మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం మీరు ప్రతిరోజూ స్నానం చేాయలి. అలాగే ఎప్పటికప్పుడు జుట్టును కడుక్కోవాలి. దీనివల్ల బ్యాక్టీరియా, దురద, అలెర్జీలు మొదలైన సమస్యలు రావు.
సరైన సైజు దుస్తులు
మీ శరీరానికి అనుగుణంగా సరిపోయే దుస్తులు ధరించడం వల్ల కూడా మీరు, మీ వ్యక్తిత్వం అద్భుతంగా కనిపిస్తుంది. ఇది కూడా మీరు మేకప్ లేకుండా అందంగా కనిపించడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ శరీర తత్వాన్ని బట్టి సరైన దుస్తులు ధరించండి.
skin care
చర్మం, జుట్టు సంరక్షణ ముఖ్యం
మీరు మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపించాలంటే మాత్రం జుట్టు, చర్మం రెండింటికీ అదనపు సంరక్షణ అవసరం. దీని కోసం మీరు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయాలి. అలాగే జుట్టును దువ్వాలి.