ఒక్కరోజు ముందు ఇవి రాసినా.. పండగ రోజున మెరిసిపోతారు..!

First Published | Aug 17, 2024, 3:44 PM IST

త్వరలో రాఖీ పండగ వచ్చేస్తోంది కదా.. ఆ రోజున మీరు చాలా అందంగా కనిపించాలి అంటే.. మీ కిచెన్ లో లభించే కొన్ని వస్తువులు రాస్తే సరిపోతుందట. 
 

పండగ రోజున ఎవరికైనా చాలా స్పెషల్ గా కనపడాలనే ఉంటుంది. దాని కోసం ఆ రోజు కొత్త దుస్తులు ధరిస్తూ ఉంటాం. మ్యాచింగ్ జ్యూవెలరీ ధరించడం దగ్గర నుంచి.. మేకప్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ... ఎలాంటి మేకప్ లేకపయినా.. మీరు పండగ రోజున అందంగా కనిపించాలి అంటే... ఒక్కరోజు ముందు కవలం మూడు వస్తువులు రాస్తే చాలట. మరి, ఏం రాయాలో చూద్దాం...
 

త్వరలో రాఖీ పండగ వచ్చేస్తోంది కదా.. ఆ రోజున మీరు చాలా అందంగా కనిపించాలి అంటే.. మీ కిచెన్ లో లభించే కొన్ని వస్తువులు రాస్తే సరిపోతుందట. 
 

Latest Videos


1.పంచదార..
పంచదార లేని ఇల్లు ఉండదు. పండగ ముందు రోజు మీరు.. పంచదారతో మీ మఖాన్ని స్క్రబ్ చేస్తే చాలట. ఇలా చేయడం వల్ల.. ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ మొత్తం పోతాయట. డెడ్ సెల్స్ కూడా పోయి.. ఫేస్ చాలా స్మూత్ గా.. మెరుస్తూ ఉండేలా కనపడుతుంది.
 

అయితే.. డైరెక్ట్ గా పంచదార ముఖానికి రుద్దకుండా.. దానికి కాస్త తేనె కూడా కలపాలి.  తేనె, పంచదార రెండూ కలిపిన తర్వాత.. వేళ్లతో తీసుకొని.. ముఖానికి రాస్తూ.. సర్కిల్ మోషన్ లో మసాజ్ చేయాలి. అంతే... మృతకణాలన్నీ తొలగిపోతాయి.
 

స్క్రబ్బింగ్ చేసిన తర్వాత.. ఫేస్ ్యాక్ వేయాలి. దాని కోసం మీరు బియ్యం పిండి వాడితే సరిపోతుంది. రెండు స్పూన్ల బియ్యం పిండిలో.. కొద్దిగా రోజ్ వాటర్ వేసి కలపాలి. దీనిని ఓ పేస్టులాగా తయారు చేయాలి. ఇప్పుడు దానిని ముఖానికి రాసి... 20 నిమిషాలపాటు వదిలేయాలి.తర్వాత... ముఖాన్ని మళ్లీ శుభ్రం చేసుకోవాలి.
 

ఆ తర్వాత జెల్ మాస్క్ ప్రయత్నించాలి.  దీని కోసం తేనె ఉంటే చాలు.. తేనెను.. ముఖానికి రాసుకోవాలి. అది కూడా పసుపుతో తేనె కలిపి ముఖానికి రాయాలి. ఈ మాస్క్ ని 15 నిమిషాలు అలానే ఉంచి... తర్వాత... శుభ్రం చేసుకోవాలి.

ఈ మూడింటిని... మనం పండగకు ఒక్కరోజు రాయాలి. ఇలా చేయడం వల్ల.. మరుసటి రోజు... మీ ముఖం తాజాగా, మెరుస్తూ కనపడుతుంది. ఎలాంటి మేకప్ లు కూడా అవసరం లేదు. 

click me!