నాలుగు పదుల వయసులోనూ ఆకర్షించే అందం.. మంజు వారియర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

Published : Feb 19, 2022, 07:26 AM IST

ఆమె తన అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకుంటారట. అందులోనూ సీజన్ ఫ్రూట్స్, కూరగాయలనే ఎక్కువగా తీసుకుంటారట.

PREV
111
నాలుగు పదుల వయసులోనూ ఆకర్షించే అందం.. మంజు వారియర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
Manju Warrier

ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని వినే ఉంటారు. అయితే... ఇది మంజు వారియర్ విషయంలో వంద శాతం కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె వయసు నాలుగు పదులు దాటినా... ఇప్పటికీ 20ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆమె ఓ స్కూల్  యూనిఫాం వేసుకున్న ఫోటో ఒకటి బయటకు రాగా.. అది చూసినవారెవ్వరూ ఆమెకు 43ఏళ్లు అంటే ఎవ్వరూ నమ్మరు.  మరి ఈ వయసులోనూ ఆమె అంత అందంగా, అంత ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటి..? ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో ఓసారి తెలుసుకుందామా..

211

ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూ మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంజు వారియర్. 

311

మంజు వారియర్ 1995 లో వచ్చిన సాక్ష్యం అనే మలయాళ సినిమాతో తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టారు. అప్పటికి మంజు వారియర్ వయసు దాదాపు 17 ఏళ్లు. ఆ తర్వాత ఎన్నో మలయాళం సినిమాల్లో నటించారు. మంజు వారియర్ మంచి డాన్సర్ కూడా. తన డాన్స్ కి ఎన్నో అవార్డులను అందుకున్నారు.

411

17 ఏళ్లకే తన కెరీర్ ని మొదలు పెట్టిన మంజు వారియర్, 18 సంవత్సరాల అప్పుడు సల్లప్పం అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో హీరోగా నటించిన దిలీప్ ని 1998లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ మీనాక్షి అనే పాప కూడా ఉంది. పెళ్లయిన తర్వాత మంజు వారియర్ ఎక్కువగా సినిమాలు చేయలేదు.  కాగా.. ఇటీవల ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

511

ఆమె తన అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకుంటారట. అందులోనూ సీజన్ ఫ్రూట్స్, కూరగాయలనే ఎక్కువగా తీసుకుంటారట.

611
manju warrier

మంజు వారియర్ ఎక్కువగా బయట తయారు చేసే ఆహారం పట్ల పెద్దగా ఆసక్తి చూపించరట. ఎక్కువగా ఇంట్లోనే తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారట.

711
manju warrier

అంతేకాకుండా.. ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఆమె అస్సలు తీసుకోరు. బయటి ఆహారాన్ని కూడా అస్సలు తినరట. ఇక మంజువారియర్ తనకు తాను ఫిట్ గా ఉండేందుకు జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఆహారాలు, స్వీట్స్ కి చాలా దూరంగా ఉంటుందట. 

811
manju warrier

ఇక ఫిట్నెస్ విషయానికి వస్తే.. మంజు వారియర్.. మంచి డ్యాన్సర్. చిన్నతనం నుంచే ఆమె కథకళి డ్యాన్స్ నేర్చుకుంది. కాబట్టి.. తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రతిరోజూ డ్యాన్స్ చేస్తూ ఉంటుందట. దాని వల్లే ఆమె ఫిట్ గా కనిపిస్తుందట.

911

డ్యాన్స్ తో పాటు.. మంజు ప్రతిరోజూ యోగా చేస్తారట. దాని వల్ల.. ఆమె శరీరం ఫ్లెక్సిబుల్ గా.. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. తాను ఫిట్ గా ఉండేందుకు ఆమె జిమ్ కి వెళ్లదట. 

1011

కానీ.. ప్రతిరోజూ తన శరీరంలోని క్యాలరీలు కరిగించేందుకు వాకింగ్ చేస్తూ ఉంటుందట. కనీసం రోజూ గంట సేపు వాకింగ్ చేస్తుందట.

1111

తన ఫిట్నెస్ ని కాపాడుకోవడంతో పాటు.. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు.. ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుందట. దాని వల్లే మరింత అందంగా కనపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories