వర్షాకాలంలో బయటకు వెళితేనే అలెర్జీ వస్తుందని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. అవును ఇంట్లో గోడలకు, అల్మారాలకు, టేబుల్లకు పేరుకుపోయిన దుమ్ము వల్ల కూడా అలెర్జీ వస్తుంది. మీకు తెలుసాఝ ఈ సీజన్ లో చాలా దుమ్ము ఇంట్లకు వస్తూనే ఉంటుంది. ఈ దుమ్ము ఇంట్లోని గోడలకు, కర్టెన్లలకు, కార్పెట్లకు, ఫ్యాన్లకు బాగ అంటుకుంటుంది. దీనివల్ల తుమ్ములు బాగా వస్తాయి. అందుకే ఇంటిని ప్రతిరోజూ శుభ్రపరుచుకోవాలి. ఒక్కరోజు శుభ్రం చేయకపోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు అనుకుంటే మాత్రం క్లీనింగ్ మీకు పెద్ద టాస్క్ గా మారుతుంది. చాలా ఈజీగా ఇంట్లో దుమ్మును ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రతి ఒక్కరూ రోజూ ఇంటిని క్లీన్ చేస్తూనే ఉంటారు. క్లీనింగ్ అనేది ఆడవాళ్ల రోజువారీ పనుల్లో ఒకటి. అయితే మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో దుమ్ము లేకుండా చేయొచ్చు. అయితే ఇందుకోసం మీరు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.
ఇంట్లో దుమ్ము కనిపించకూడదంటే మీరు ఉదయం లేవగానే ముందుగా చేయాల్సిన పని ఇంటిని శుభ్రపరచడం. కేవలం చీపురుతో ఊడిస్తే సరిపోదు. నీళ్లతో తుడవాలి. ముందు ఇళ్లును ఉడిచి ఆ తర్వాత వాటర్ తో తుడవండి. మోప్ తో తుడవడం వల్ల దుమ్ము అస్సలు ఉండదు.
మీరు ఎప్పుడైనా గమనించారా? ఊడ్చేటప్పుడు దుమ్ము ఎగురుతుంది. ఇది అల్మారా, టేబుల్, గోడలు, పరుపులు మొదలైన వాటికి పట్టుకుంటుంది. వీటిని చాలా రోజులు అలాగే వదిలేయడం వల్ల ఇవి మురికిగా అవుతాయి. అలాగే వాసన కూడా వస్తుంది. అందుకే హెవీగా ఉండే బెడ్ షీట్ లను ఉపయోగించకూడదు. వీటిని వాష్ చేయడం చాలా కష్టం. అందుకే లైట్ వెయిట్ ఉండే బెడ్ షీట్ లను ఉపయోగించండి. వీటిని క్లీన్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
డోర్స్ కు, కిటికీలకు ఖచ్చితంగా కర్టెన్లను ఉపయోగిస్తాం. అలాగే ఇళ్లు అందంగా కనిపించేందుకు హెవీ కార్పెట్లను కూడా ఉపయోగిస్తాం. కానీ బరువు ఎక్కువగా ఉండే కార్పెట్లు, కర్టెన్లను క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే తేలికపాటి కర్టెన్లు, కార్పెట్లను, చాపలను ఉపయోగించాలి. మందంగా ఉండటం వల్ల దానిలో ఉన్న దుమ్మును పోగొట్టడం కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా వీటిని శుభ్రం చేసినప్పుడు అందులో ఉన్న దుమ్ము ఇతర వస్తువులపై పేరుకుపోతుంది.
రోజూ క్యాబినెట్లను, అల్మారాలను శుభ్రం చేయడం కష్టమే అయినప్పటికీ.. వీటిని రోజూ క్లీన్ చేయకపోతే వీటిపై దుమ్ము పేరుకుపోతుంది. మీరు శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తే దుమ్ము బాగా పేరుకుపోయిన మురికిగా, మొండిగా మారుతాయి.