స్ట్రెయిట్ హెయిర్ పెరుగుతూనే ఉంటుంది. కానీ కర్లీ హెయిర్ మాత్రం అస్సలు పెరగదు. కర్లీ హెయిర్ పెరగడానికని రకరకాల షాంపూలు, నూనెలను పెడుతూనే ఉంటారు. కానీ వెంట్రుకలు మాత్రం కొంచెం కూడా పెరగవు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో కర్లీ హెయిర్ పెరిగేలా చేయొచ్చు. ముఖ్యంగా ఆవనూనెతో కర్లీ హెయిర్ పెరిగేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్లీ వెంట్రుకలు పెరగడానికి కావాల్సిన పదార్థాలు
2 టీస్పూన్ల ఆవనూనె, 3 టీస్పూన్ల పెరుగు. ఈ హెయిర్ మాస్క్ ను పెట్టడానికి ముందు మీ జుట్టును శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత 2 టీస్పూన్ల ఆవనూనెలో 3 టీస్పూన్ల పెరుగును మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయండి. 45 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.
వారానికి రెండుసార్లు
ఈ హెయిర్ మాస్క్ వెంట్రుకల మూలాలు బలంగా ఉండటానికి, వెంట్రుకలు షైనీగా కనిపించడానికి బాగా ఉపయోగపడతాయి. అందుకే ఈ హెయిర్ మాస్క్ ను వారానికి రెండు సార్లు పెట్టండి. దీనివల్ల తలపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను నాశనం అవుతాయి. అలాగే వెంట్రుకలను పెంచి కర్లీ హెయిర్ షైన్ ను పెంచుతుంది
జుట్టుకు ఆవ నూనె ప్రయోజనాలు
ఆవనూనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిని ఉపయోగించడం వల్ల జుట్టుకు ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది. ఆవనూనెలో ఉండే విటమిన్ ఇ, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు చుండ్రును, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అలాగే జుట్టు పొడుగ్గా పెరిగేలా చేస్తాయి.
జుట్టుకు పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు
పెరుగు మన ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా మంచి మేలు చేస్తుంది. పెరుగులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడే ముఖ్యమైన పదార్ధం. ఇది జుట్టు రాలడాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది.