ఏం చేస్తే మడమల పగుళ్లు తగ్గుతాయంటే?

First Published | Aug 4, 2024, 4:39 PM IST

చాలా మందికి మడమల పగుళ్లు ఉంటాయి. ఈ పగుళ్లు మరీ ఎక్కువగా ఉంటే వాటి నుంచి రక్తం కూడా కారుతుంటుంది. దీనివల్ల నడవడానికి, నిల్చోవడానికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఈ పగుళ్లను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


మడమలు పగలడం వల్ల పాదాలు విపరీతంగా నొప్పి ఉంటాయి. ఈ పాదాల పగుళ్లు సర్వ సాధారణమైన సమస్య. కానీ చాలా మందికి ఉంటుంది. మడమలు బాగా పొడిబారడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి. కొన్ని కొన్ని సార్లైతే ఈ పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతుంటుంది. ఎక్కువ గంటలు నిలబడటం, ఊబకాయం, కొన్ని అనారోగ్య సమస్యలు, లేదా  పాదాల సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల పాదాలు పగుళుతాయి. ఈ పగుళ్లను ఇంటి నుంచే ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

పాదాల ఎక్స్ఫోలియేషన్

మీ పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పగుళ్లు తగ్గడానికి వారానికి కనీసం రెండుసార్లు ఎక్స్ఫోలియేట్ చేయాలి. ఇందుకోసం గోరువెచ్చని, సబ్బు నీటి టబ్ తీసుకొని మీ పాదాలను సుమారుగా 20 నిమిషాలు లేదా చర్మం మృదువుగా మారే వరకు దానిలో ముంచండి.  దీంతో మడమలలోని చనిపోయిన చర్మ కణాలను స్క్రబ్ చేయడానికి ఫుట్ స్క్రబ్బర్ లేదా ప్యూమిస్ స్టోన్ ఉపయోగించండి.


పాదాల తేమ

పాదాలు పొడిబారడం వల్ల కూడా పాదాలు పగుళ్లు వస్తాయి. కాబట్టి మీ పాదాలను తేమగా ఉంచడానికి ప్రయత్నించండి. దీంతో మీ చర్మం మృదువుగా మారుతుంది. పగుళ్లు ఏర్పడవు. ఇందుకోసం ఫుట్ క్రీమ్ తీసుకొని మడమలకు అప్లై చేయండి. చేతులతో నెమ్మదిగా 2-3 నిమిషాలు మసాజ్ చేయండి. తర్వాత మాయిశ్చరైజర్ శోషణను పెంచడానికి శుభ్రమైన మృదువైన కాటన్ సాక్స్ ను వేసుకోండి. 
 

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. పగుళ్లు తగ్గాలంటే రాత్రిపూట పగిలిన పాదాలకు కొబ్బరి నూనెను పెట్టండి. తర్వాత కాటన్ సాక్స్ ను వేసుకుని పడుకోండి. ఉదయం వరకు సాక్స్ లను తీయకూడదు. 

పెట్రోలియం జెల్లీ

పెట్రోలియం జెల్లీ కూడా పాదాల పగుళ్లను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇది మీ పాదాలను తేమగా ఉంచుతుంది. అలాగే పాదాల పగుళ్లను నయం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం పెట్రోలియం జెల్లీకి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పగుళ్లకు పెట్టండి. 
 

తేనె

తేనె సహజ హ్యూమెక్టెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే ఇది తేమను ఆకర్షించగలదు. నిలుపుకోగలదు. తేనెలో గాయాలకు వైద్యం చేసే లక్షణాలు కూడా ఉంటాయి. గోరువెచ్చని నీటితో కడిగే ముందు మడమలకు బాగా తేనెను అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత పాదాలను గోరువెచ్చని నీటితో కడిగేయండి. 

Latest Videos

click me!